కొంతసేపటి క్రితం తిరుపతిలో తొక్కిసలాట జరిగిన నలుగురు భక్తులు చనిపోయిన విషయం తెలిసిందే. ఇందులో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా కనిపిస్తోంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. భక్తుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందని చెప్పారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటూ గాయాలపాలైన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. టీటీడీ, తిరుపతి జిల్లా అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. లోకేశ్ స్పందన... వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల విడుదల నేపథ్యంలో తిరుపతిలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన తొక్కిసలాటలో నలుగురు భక్తులు మృతి చెందడం నన్ను తీవ్ర మనోవేదనకు గురిచేసింది అన్నారు ఐటీ మంత్రి నారా లోకేశ్. ఇటువంటి అవాంచనీయ ఘటనలకు తావీయకుండా టిటిడి మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి. మృతి చెందిన భక్తుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. Also Read: TML: తిరుమల తొక్కిసలాట భీభత్సం..వైరల్ అవుతున్న వీడియోలు తీవ్ర ఆవేదనకు లోనయ్యా.. తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవడం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మృతుల కటుంబాలకు సానుభూతిని తెలిపారు. బాధితకుటుంబాలకు తగిన సహాయసహకారాలను అందించాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి టికెట్ కౌంటర్ల దగ్గర అధికారులు, పోలీసులకు సహకరించాలని జనసైనికులకు సూచించారు పవన్ కల్యాణ్. జగన్ స్పందన.. తిరుపతిలో టోకెన్లు జారీ దగ్గర జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. గాయపడిన వారు వెంటనే కోలుకోవాలని కోరుకున్నారు. Also Read: BIG BREAKING: తిరుపతి తొక్కిసలాట వెనుక కుట్ర కోణం?