/rtv/media/media_files/2025/03/12/2NZzbf8352qfW9aUtRUB.jpg)
WAR 2 release postponed
War 2: హృతిక్ రోషన్- ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మల్టీ స్టారర్ 'వార్ 2'. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. 'వార్ 2' ఎన్టీఆర్ నటిస్తున్న తొలి స్ట్రెయిట్ హిందీ ఫిల్మ్ కావడంతో మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఓ వార్త ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూపులు నీళ్లుజల్లింది.
Also Read: అత్యంత దయనీయంగా శ్రీతేజ్ పరిస్థితి.. కనీసం కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేని దుస్థితి
వార్ 2 విడుదల వాయిదా..
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. వార్ 2 విడుదల ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. అయితే గతకొద్దిరోజులుగా ముంబై లో ఎన్టీఆర్- హృతిక్ పై భారీ పాటను చిత్రీకరిస్తున్నారు. దాదాపు 500 మందికి పైగా డాన్సర్లు ఇందులో పాల్గొంటున్నారు. కాగా, ఈ పాట చిత్రీకరణ సమయంలో హీరో హీరో హృతిక్ రోషన్ గాయపడినట్లు తెలిసింది. దీంతో వైద్యులు ఆయనను నెలరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉందని అంటున్నారు.
ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?
ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస లైన్ అప్ సినిమాలతో బిజీగా ఉన్నారు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో #NTRNeel, మరోవైపు దేవర పార్ట్ 2 చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇటీవలే #NTRNeel షూటింగ్ మొదలైనట్లు అధికారికంగా ప్రకటించారు. అలాగే మొదటి రోజు షూటింగ్ నుంచి ఓ యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన ఫొటోను షేర్ చేయగా.. క్షణాల్లో వైరల్ అయ్యింది. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్‌లో 1000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గోన్నట్లు సమాచారం.
Also Read: అత్యంత దయనీయంగా శ్రీతేజ్ పరిస్థితి.. కనీసం కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేని దుస్థితి