Renu Desai : రేణు దేశాయ్‌పై ట్రోలింగ్.. ఇద్దరు నిందితుల అరెస్ట్

సినీ నటి రేణు దేశాయ్‌ను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో అసభ్యకరమైన,  అసభ్య పదజాలంతో దూషించిన ఇద్దరు వ్యక్తులను సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు తాజాగా  అరెస్ట్ చేశారు.

New Update
renu desai ap

renu desai ap Photograph: (renu desai ap )

సినీ నటి రేణు దేశాయ్‌(Renu Desai) ను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియా(Social Media) లో అసభ్యకరమైన,  అసభ్య పదజాలంతో దూషించిన ఇద్దరు వ్యక్తులను సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు తాజాగా  అరెస్ట్ చేశారు. తనపై సోషల్ మీడియా వేదికగా కొందరు వ్యక్తులు పనిగట్టుకుని అసభ్యకర కామెంట్లు చేస్తున్నారని, తప్పుడు కథనాలను ప్రచారం చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని రేణు దేశాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా వీధి కుక్కల సమస్య వంటి సామాజిక అంశాలపై ఆమె స్పందించిన తర్వాత ఈ వేధింపులు మరీ ఎక్కువయ్యాయని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Also Read :  కోర్టును ఆశ్రయించిన జాన్వీ కపూర్.. కారణమేంటంటే..?

ఈ కేసులో మరికొందరి ప్రమేయం

ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న  పోలీసులు(telangana-police) డిజిటల్ ఫొరెన్సిక్ పద్ధతులను ఉపయోగించి నిందితుల వివరాలను సేకరించారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం నిందితులపై ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అనామక అకౌంట్ల వెనుక దాక్కుని ఎవరినైనా దూషించవచ్చని భావించడం పొరపాటని, ముఖ్యంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

కొన్ని రోజుల క్రితమే రేణు దేశాయ్ ఒక వీడియోను విడుదల చేస్తూ, తనను టార్గెట్ చేస్తున్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. గత కొన్నేళ్లుగా ఆమె నిరంతరం ఆన్‌లైన్ వేధింపులను ఎదుర్కొంటూనే ఉన్నారు. గతంలో యాంకర్ అనసూయ విషయంలో కూడా ఇలాంటి వేధింపులకు పాల్పడిన వారిపై తెలంగాణ పోలీసులు కఠినంగా వ్యవహరించారు. తాజాగా రేణు దేశాయ్ కేసులో తీసుకున్న ఈ చర్యలు సైబర్ వేధింపుల పట్ల ఔప్రభుత్వం ఎంత కఠినంగా ఉందో మరోసారి స్పష్టం చేస్తున్నాయి.

Also Read :  పోలీస్ యూనిఫామ్ మళ్లీ వర్కౌట్ అవుతుందా..?

Advertisment
తాజా కథనాలు