/rtv/media/media_files/2025/02/22/KLg8TBNtSSyE3z1vfvo0.jpg)
Sundari serial actress Gabriella shares her baby shower photos
నటి గాబ్రియెల్లా తాజాగా తన అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ‘సుందరి’ సీరియల్‌తో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న ఈ నటి వెండితెరపై సైతం తనదైన శైలిలో పాపులారిటీ దక్కించుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే అప్డేట్ అందించింది. తాను తల్లి కాబోతున్నట్లు తెలిపింది.
Also Read: తెలంగాణలో విషాదం.. మరో రైతు ఆత్మహత్య
హీరోయిన్ గుడ్ న్యూస్
ఈ మేరకు తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో సీమంతం జరిగిన ఫోటోలు షేర్ చేసింది. అందులో తన భర్త ఆకాశ్‌తో దిగిన ఫోటోలు ఉన్నాయి. ‘బేబీ షవర్’ అనే క్యాప్షన్‌ను ఆ ఫొటోలకు జోడించింది. దీంతో ఆ ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Also Read: Trump-Musk:మస్క్ కుమారుడి అల్లరి వల్ల 145 సంవత్సరాల డెస్క్ మార్చేసిన ట్రంప్!
ఇకపోతే ఈ అమ్మడు సినీ కెరీర్ విషయానికొస్తే.. గాబ్రియెల్లా ‘సుందరి’ సీరియల్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సీరియల్‌లో సుందరి దేవిగా నటించి ఎంతో మందిని ఆకట్టుకుంది. అదే క్రేజ్‌తో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కబాలి’ సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించింది.
Also Read: Punjab: 405 రోజులు... 10 దేశాలు... 41 లక్షల రూపాయలు.. చేరిన గమ్యం.. కానీ అంతలోనే!
ఇందులో తన యాక్టింగ్‌కు మంచి స్పందన రావడంతో ఆ తర్వాత ‘కాంచన3’, ‘కట్టు మారం’, ‘ఎన్4’, ‘ఐరా’ వంటి సినిమాల్లా నటించి అలరించింది. ఇక తన సినీ కెరీర్ పీక్స్‌లో ఉన్నపుడే ఆకాశ్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఆ తర్వాత ప్రేమ పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఓ వైపు సినిమాలు, మరోవైపు మ్యారీడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు తల్లి కాబోతున్నట్లు తెలిపి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది.