/rtv/media/media_files/2025/02/22/NlUNOFSyLo1OVCxddaVp.jpg)
Rajinikanth Upcoming Movie Updates
Rajinikanth Upcoming Movies: తలైవా రజినీకాంత్ 74 ఏళ్ళ వయసులో కూడా వరుస మూవీస్ తో దూసుకెళ్తున్నారు. కేవలం సినిమాలు తీయడమే కాదు సూపర్ హిట్ సక్సెస్ కూడా కొడుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘కూలీ’(Coolie) మూవీ ఇంకా షూటింగ్ దశలో ఉండగానే రజినీకాంత్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌గా ‘జైలర్ 2’(Jailer 2)ని అనౌన్స్ చేసారు. రీసెంట్ గా విడుదలైన జైలర్ 2 అనౌన్స్మెంట్ వీడియోకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
నెల్సన్- రజినీకాంత్ కంబోలో వచ్చిన జైలర్ పార్ట్ 1 సూపర్ హిట్ కాగా, జైలర్ 2 పై కూడా ఆడియన్స్ లో హై ఎక్సపెక్టషన్స్ ఉన్నాయి. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే రజినీకాంత్ తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్‌పై కూడా కథా చర్చలు మొదలు పెట్టినట్లు సమాచారం.
Also Read: Viral News: రిసెప్షన్‌కు ముందు బ్యూటీపార్లర్‌కు వెళ్లొస్తానని..ప్రియుడితో జంప్ అయిన నవవధువు!
వెట్రిమారన్ రజినీకాంత్ కాంబోలో మూవీ..!
‘వడ చెన్నై’, ‘అసురన్’, ‘విడుదల’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ ఇటీవల రజినీకాంత్ ను కలిసి ఒక కొత్త కథను వినిపించారని తెలుస్తోంది. అయితే, ఈ కథపై రజినీకాంత్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధమైన తర్వాత వెట్రిమారన్ రజనీకాంత్‌తో మరోసారి కథపై చర్చలు జరుపుతారని అంచనా. ప్రస్తుతం, వెట్రిమారన్ సూర్యతో ‘వాడివాసల్’ సినిమాను పట్టాలెక్కించేందుకు సన్నద్ధమవుతున్నారు. వెట్రిమారన్ రజినీకాంత్ కాంబోలో మూవీ ఫైనల్ అయితే మాత్రం రజినీ లైన్ అప్ లో ఇంకో క్రేజీ ప్రాజెక్ట్ యాడ్ అయినట్టే.