సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే ప్రాణాలు కోల్పోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో మాట్లాడుతూ, తెలుగు సినిమా ఇండస్ట్రీని, ప్రత్యేకించి హీరో అల్లు అర్జున్‌ను తీవ్రంగా విమర్శించారు. తాను సీఎంగా ఉన్నంతకాలం ప్రీమియర్ షోలకు లేదా టికెట్ల ధరల పెంపుకు అనుమతి ఇవ్వబోమని స్పష్టంగా చెప్పారు. ఈ ఘటనపై అల్లు అర్జున్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం.. రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమని ఆరోపణలు చేసింది. అయితే, ఈ విషయంపై సినిమా పరిశ్రమ నుంచి బన్నీకి ఎలాంటి సపోర్ట్ రాలేదు. we support #Alluarjun . stop targeting high profile people just for cheap publicity. https://t.co/UKVP6TQyNa — Sanjjanaa Galrani (@SanjjanaaG) December 23, 2024 ఇది కూడా చదవండి: Allu Arjun: సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్, సుకుమార్ భారీ ఆర్థిక సాయం తాజాగా ఈ ఇష్యూలో ఓ హీరోయిన్ మాత్రం అల్లు అర్జున్ ను సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. హీరోయిన్ సంజనా గల్రానీ ఈ విషయంలో అల్లు అర్జున్‌కు మద్దతు తెలిపారు. ఈ ఘటనకు అల్లు అర్జున్ నేరస్థుడిగా చూడడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. ఇది అన్యాయం.. ఆయనను కావాలని ఈ కేసులో నిందితుడిగా చూపిస్తున్నారని.. తెలుగు రాష్ట్రాల్లో సినీ హీరోల ఫ్యాన్స్ స్థాయిని అర్థం చేసుకోవాలని, అది అభిమానం కాకుండా ఓ పిచ్చిగా మారిందని వ్యాఖ్యానించారు. అలాగే, థియేటర్‌కు హీరో రావడం ఇదే మొదటిసారి కాదని, అలాంటి ఘటనలకు అల్లు అర్జున్‌ను బాధ్యుడిగా చూపడం అన్యాయం అని ఆమె పేర్కొన్నారు. కాగా ఈ ఘటనలో బన్నీకి మద్దతుగా నిలిచినా ఏకైక హీరోయిన్ సంజనా గల్రానీ కావడం విశేషం. కాగా సంజనా గల్రాని.. ప్రభాస్ - పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన 'బుజ్జిగాడు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.