/rtv/media/media_files/2026/03/15/rashmika-leg-2026-03-15-19-22-32.jpg)
హీరో విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా షేర్ చేసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కాలుకు కట్టుతో (ఫ్రాక్చర్) కనిపిస్తోంది. నేషనల్ క్రష్ రైట్ లెగ్‌కు గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో ఆమె పాదానికి బ్యాండేజ్ కట్టింది.
Brotherly love on display as #VijayDeverakonda wishes #AnandDeverakonda with sweet glimpses!🤗❤️#HBDAnandDeverakonda#TeluguFilmNagarpic.twitter.com/aLgjWeITl7
— Telugu FilmNagar (@telugufilmnagar) March 15, 2026
ఇటీవలే విజయ్, రష్మిక వివాహం గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్లో ఉన్న 'ITC మెమెంటోస్' అనే రాయల్ రిసార్ట్‌లో వీరి వివాహం వైభవంగా జరిగింది. పెళ్లయిన కొద్ది రోజులకే రష్మిక ఇలా గాయంతో కనిపించడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. "కొత్త కోడలికి ఏమైంది?", "అప్పుడే గాయమా?" అంటూ నెటిజన్లు బాధపడుతున్నారు. అయితే, రష్మికకు జనవరి 2025లోనే జిమ్‌లో వర్కౌట్ చేస్తూ కాలుకు తీవ్రమైన గాయమైంది. ఆ సమయంలో ఆమె కొన్ని నెలల పాటు విశ్రాంతి కూడా తీసుకున్నారు. విజయ్ షేర్ చేసిన ఫొటో ఇప్పటిదా లేక గతంలోదా అనేది క్లారిటీ లేదు.
Follow Us