గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నిన్న మూవీ ట్రైలర్ ను బయటకు వదిలారు. ట్రైలర్ లో కొత్తగా ఏమీ లేదు. అలా అని పాతదేమీ కాదు. నిజాయతీ గల ఐఏఎస్ ఆఫీసర్ కు, అవినీతి గల రాజకీయ నాయకుడికి మధ్య జరిగే పోరే ఈ గేమ్ ఛేంజర్. కానీ శంకర్ ఈ కథను డీల్ చేసిన విధానం కాస్త డిఫరెంట్ గా ఉన్నట్లుగా కనిపించింది. ట్రైలర్ లలో చాలా గేటప్స్ లలో కనిపించాడు రామ్ చరణ్. ఇందులో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రైతుగా, స్టూడెంట్ గా, కలెక్టర్ గా, పోలీస్ ఆఫీసర్ గా చరణ్ ను చూపించారు శంకర్. కలెక్టర్ గా ఓకే కానీ పోలీస్ ఆఫీసర్ రోల్ ఎంటన్నది ఇప్పుడు ఫ్యాన్స్ను కన్ఫ్యూజన్లోకి నెట్టింది. ఒకేసారి ఐఏఎస్, ఐపీఎస్ అధికారిగా పనిచేయడం అనేది అసాధ్యం కాబట్టి ఇందులో చరణ్ ట్రిపుల్ రోల్ చేస్తున్నాడా అన్నది ఆసక్తికరంగా మారింది. Also Read : యూట్యూబ్ లో దుమ్ములేపుతున్న జాతర సాంగ్.. ఫుల్ వీడియో చూశారా? Assalu rendintiki link ey ledu ,Game changer lo father RC flashback lo samaja seva chestadu vadini evaro mosam chestaru koduku IPS ayyi racha chestadu but thana powers limited ani teluskuni IAS ayyi father revenge teerustadu🤣 pic.twitter.com/x9xvNbaEpL — Salaar Varma (@Salaar_Varma) January 2, 2025 తెలుగులో స్ట్రైయిట్ మూవీ శంకర్ కు డైరెక్ట్ గా తెలుగులో ఇదే ఫస్ట్ స్ట్రైయిట్ మూవీ. భారతీయుడు2 ప్లాప్ తో శంకర్ ఈ మూవీపైన భారీ హోప్స్ అయితే పెట్టుకున్నారు. ఈ సినిమాను కేవలం తెలుగు, తమిళ్ లోనే రిలీజ్ చేస్తు్న్నారు. తెలుగులో ఉన్నంత హైప్ ఈ మూవీపై తమిళనాట లేదు. దీనికి తోడు రాజమౌళి ప్లాప్ సెంటిమెంట్ రామ్ చరణ్ ను వెంటాడుతుంది. ఈ ఏడాది సంక్రాంతికి ఈ సినిమాతో పాటుగా బాలయ్య, వెంకటేష్ ల సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. మరి ఇన్నింటి మధ్య ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో అన్నది చూడాలి.