/rtv/media/media_files/2025/02/27/vDGxV0UXJsCmFvRzVXAV.jpg)
Rajinikanth Coolie Teaser:
Rajinikanth Coolie Teaser: సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ ఒక్క తమిళనాడు లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన క్రేజ్ వేరే లెవెల్. ఇటీవల జైలర్(Jailer) సినిమా అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగులో కూడా సూపర్‌హిట్ సాధించి రజినీకాంత్ కు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. రీసెంట్ గా ఆ సినిమాకు సీక్వెల్‌ను కూడా ప్రకటించారు డైరెక్టర్ నెల్సన్. జైలర్ తర్వాత వేట్టయాన్‌తో బ్యాక్ తో బ్యాక్ హిట్లు కొట్టాడు సూపర్ స్టార్.
Also Read: Samantha: "సంథింగ్ స్పెషల్" అంటూ సమంత పోస్ట్ ...పెళ్లి గురించేనా..? - Rtvlive.com
ప్రస్తుతం రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ' అనే ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కూడా ఈ మూవీ లో ఒక స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌తో(LCU) సంబంధం లేకుండా, కూలీ ఒక స్టాండ్ ఎలోన్ ఫిల్మ్‌గా రూపొందుతోంది.
మరో రెండు వారాల్లో టీజర్..
అయితే, ఈ సినిమా యూనిట్ కూలీ టీజర్‌ను రిలీజ్ చేయడానికి సిద్ధమైందని తెలుస్తోంది. టీజర్‌ను ఇప్పటికే లాక్ చేసారని, మరో రెండు వారాల్లో ఈ టీజర్‌ను రిలీజ్ చేయనున్నారని సమాచారం అందుతోంది. టీజర్‌తో పాటు, మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. టీజర్ అవుట్ ఫుట్ తో రజిని అండ్ టీం ఫుల్ హ్యాపీగా ఉన్నారట.
Also Read: SLBC ప్రమాద ఘటన.. రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్
మార్చి 14న, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పుట్టిన రోజు సందర్భంగా, 'కూలీ' నుండి కొత్త విజువల్ కంటెంట్ తో టీజర్ ను విడుదల చేయడానికి ఫిక్స్ అయ్యారట మూవీ టీం. ఫాస్ట్ గా షూటింగ్ పనులు ముగించుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది 'కూలీ' మూవీ.
Also Read: హైదరాబాద్ నుంచి ఏపీకి స్పెషల్ ట్రైన్స్.. లిస్ట్ ఇదే
ఈ సినిమాలో రజినీ సరసన పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. అలాగే, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునతో పాటు ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్, బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ కూడా క్యామియో పాత్రలో కనిపించనున్నారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: Chhaava: ఛత్రపతి మహారాజ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్.. 'ఛావా' ఇప్పుడు తెలుగు వెర్షన్ లో కూడా