‘చిరు, పవన్, ప్రభాస్ ఎక్కడ పడుకున్నారు.. ఎంత దుర్మార్గులు రా మీరు’!

అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన నిందితులు వీడియో రిలీజ్ చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే అల్లు అర్జున్ సెక్యూరిటీ తమమీద దాడి చేశారన్నారు. శ్రీతేజ్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ రాకుండా ఎక్కడ పడుకున్నారన్నారు.

New Update
JAC leader Video about Allu Arjun house attack

JAC leader Video about Allu Arjun house attack

అల్లు అర్జున్‌ ఇంటిపై నిన్న (ఆదివారం) దాడి జరిగింది. ఓయూ జేఏసీ నాయకులు బన్నీ ఇంటిని ముట్టడించారు. ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు. ఇంటిపై రాళ్లు రువ్వారు. ఇంటి బయట ఉన్న పూల కుండీలను ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన బాడీగార్డులపై ఎగసిపడ్డారు. అల్లు అర్జున్ వల్లే రేవతి చనిపోయిందంటూ ఆరోపణలు చేశారు. ఆమె కుటుంబానికి అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దాదాపు రూ.కోటి నష్టపరిహారంగా చెల్లించాలన్నారు. అలాగే రేవతి కుటుంబానికి బన్నీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

నిందితులపై పలు సెక్షన్లు

విషయం తెలిసి అక్కడకు చేరుకున్న పోలీసులు.. వారిని అదుపు చేశారు. దాడి చేసిన వారిని రెడ్డి శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఆరుగురుని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి నిందితులపై BNS 331(5), 190, 191(2), 324(2), 292, 126(2), 131 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. దీంతో అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో ఈ ఆరుగురికి రిమాండ్ విధించింది.

నిందితులకు కోర్టులో ఊరట

తాజాగా ఈ ఆరుగురు నిందితులకు కోర్టులో భారీ ఊరట లభించింది. అల్లు అర్జున్ ఇంటిపై దాడికి చేసిన ముగ్గురు నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈరోజు ఉదయం వనస్థలిపురంలోని కమలానగర్ లో జస్టిస్ ముందు ప్రవేశ పెట్టగా.. ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున జరిమానా విధించింది. 

Also Read: ధమ్ బిర్యానీలో బ్లేడ్.. హాస్పిటల్ పాలైన కస్టమర్! 

వీడియో రిలీజ్ చేసిన జేఏసీ నాయకుడు

ఇప్పుడు ఈ నిందితుల్లో ఒక వ్యక్తికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ ఇంటి మీద దాడి నిందితుల్లో ఒక యువకుడు ఏకంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుండే వీడియో తీసి వార్నింగ్ ఇచ్చాడు. అల్లు అర్జున్ ఇంటి ముందు శాంతి యుతంగా ధర్నా చేస్తుంటే.. వాళ్ల సెక్యూరిటీ సిబ్బంది తమపై విచక్షణా రహితంగా దాడి చేశారని ఆ యువకుడు తెలిపాడు. 

ఈ మేరకు అతడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ‘‘మాపై కావాలనే దాడి చేసి.. కేసులు పెట్టే ప్రయత్నం అల్లు అర్జున్ చేశాడు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్ ఎక్కడ పడుకున్నారు. శ్రీతేజ్ కుటుంబాన్ని కనీసం పరామర్శించని దుర్మార్గులు.. అల్లు అర్జున్‌‌కి ఏదో అయినట్లు వచ్చి పరామర్శిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం’’ అని ఆ యువకుడు వీడియోలో పేర్కొన్నాడు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు