'పుష్ప2' వివాదం.. ఎట్టకేలకు స్పందించిన రాజేంద్ర ప్రసాద్

'పుష్ప2' వివాదంపై సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు. తాను అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని తెలిపాడు. అల్లు అర్జున్ నా కొడుకు లాంటి వాడు. అత‌డిని అలా అంటానా. బ‌న్నీ నువ్వు నా బంగారం ల‌వ్ యూ అని తెలిపాడు.

New Update
pushpa85

అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాపై సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 'హరి కథ' అనే వెబ్ సిరీస్ ప్రీ రిలీజ్ వేడుక‌లో ఆయన మాట్లాడుతూ..' కలియుగంలో వస్తున్న కథలు చూస్తున్నారు కదా.. నిన్న కాక మొన్న చూశాం.. వాడెవడో ఎర్ర చందనం స్మగ్లింగ్‌ చేసే దొంగ (పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పాత్ర‌).. వాడు హీరో.. హీరోల్లో అర్థాలు మారిపోయాయి..' అని అన్నాడు . 

అయితే ఈ వ్యాఖ్యలు 'పుష్ప 2' లో అల్లు అర్జున్ ను ఉద్దేశించే రాజేంద్ర ప్రసాద్ అన్నాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. ఆ తర్వాత మెల్ల మెల్లగా అది కాస్త వివాదంగా మారింది. దీంతో  రాజేంద్ర ప్రసాద్  తాజాగా క్లారిటీ ఇచ్చాడు. తాను అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని తెలిపాడు.

Read Also :రెండు రోజులు స్కూల్స్, కాలేజీలు బంద్.. ఎందుకంటే?

Also Read: Mohan Babu: హైకోర్టుకు మోహన్ బాబు!

లవ్ యూ బన్నీ..

' అల్లు అర్జున్ నా కొడుకు లాంటి వాడు. అత‌డిని అలా అంటానా. బ‌న్నీ నువ్వు నా బంగారం ల‌వ్ యూ. నేను పుష్ప సినిమాపై నెగిటివ్‌గా మాట్లాడాన‌ని వ‌చ్చిన వార్త‌లు చూసి న‌వ్వుకున్నాను. ఇన్ని సంవ‌త్స‌రాలుగా ఒక్క వివాదం లేదు కాదా కొత్త‌గా ఇది వ‌చ్చింది అంటూ ఎంజాయ్ చేశాను. కానీ ఇది చేసింది ఎవ‌రో కానీ వాడికి ఒక్క‌టే చెబుతున్నాను. అది అల్లు అర్జున్‌ను ఉద్దేశించి అన‌లేదు..' అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read : హాస్పిటల్ లో చేరిన మోహన్ బాబు..!

Also Read: ఎక్కువ సేపు పడుకుంటున్నారా..? మీ పని అంతే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు