Rajinikanth- Pooja Hegde: 'కావాలయ్యా' మళ్ళీ రిపీట్.. కానీ ఈసారి పూజా పాపతో..

సూపర్ స్టార్ రజనికాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'కూలీ' ఇప్పటికే రిలీజైన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా, ఈ మూవీ లో ఐటెం సాంగ్ కోసం పూజా హెగ్డేను తీసుకోవాలని చూస్తున్నారట మూవీ టీం.

New Update
Rajinikanth- Pooja Hegde

Rajinikanth- Pooja Hegde

Rajinikanth- Pooja Hegde: సూపర్ స్టార్ రజినికాంత్ తో స్టెప్పులేసే ఛాన్స్ కొట్టేసింది పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే.. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందినప్పటికీ  కొన్ని మూవీస్ మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆమె కెరీర్‌ కొంత మైనస్ అనే చెప్పాలి. దీంతో పూజా  బాలీవుడ్‌లో తన లక్ పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది. కానీ అక్కడ కూడా ఆమెకు నిరాశ ఎదురైంది.

Also Read: సీఎం సంచలన నిర్ణయం.. అవినీతికి పాల్పడ్డ 52 మంది పోలీసులు సస్పెండ్

ఈ నేపథ్యంలో పూజా ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ, బాలీవుడ్‌లోనూ పెద్దగా అవకాశాలు అందుకోలేకపోతోంది. అయితే, కోలీవుడ్‌లో ఆమె రెండు భారీ ప్రాజెక్ట్‌లకు సైన్ చేసినట్లు సమాచారం. ఈ రెండు చిత్రాలు ఒకటి ‘జన నాయగణ్‌’ (Thalapathy Vijay), ‘కాంచన 4’(Kanchana 4). కాంచన సిరీస్ కి మంచి క్రేజ్ ఉంది, ఇంక విజయ్ సినిమాల గురించి చెప్పనవసరం లేదు ఆల్మోస్ట్ అన్నీ సూపర్ హిట్లే, సో ఈ సినిమాలతో అయినా ఈ ముద్దుగుమ్మకు హిట్ వస్తుందేమో చూడాలి. 

Also Read: మొత్తం రూ.16 వేల కోట్లు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తలదన్నేలా.. RTV చేతిలో సంచలన నిజాలు!

పూజాకు బంపర్ ఆఫర్..! 

అయితే, పూజాకు ఒక అద్భుతమైన ఆఫర్ వచ్చినట్లు టాక్ నడుస్తుంది. ఏకంగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో కలిసి ఒక ఐటెం సాంగ్ లో ఆమె స్టెప్పులేస్తున్నట్లు సమాచారం. ఈ పాట ‘కూలీ’ మూవీ లో ఉండబోతుంది, ఇందులో నాగార్జున కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. 

Also Read: Rishab Shetty: ఫ్యాన్స్ కి గూస్ బంప్స్.. ఛత్రపతి శివాజీ మహారాజ్ గా రిషబ్ శెట్టి.. పోస్టర్ వైరల్

రజినికాంత్ 'జైలర్' మూవీ(Jailer Movie) లో కావాలయ్యా పాట ఎంత పెద్ద హిట్టో అందరికి తెలుసు, సో ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో పూజా తో ఐటెం సాంగ్ సెట్ చేసాడంట డైరెక్టర్ లోకేష్(Lokesh Kanagaraj). ఈ ఐటమ్‌ సాంగ్‌(Coolie Movie Item Song) లో రజనీకాంత్‌, నాగార్జున(Akkineni Nagarjuna) కూడా కనిపించనున్నారని టాక్. అయితే పూజా ఈ పాటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తన కెరీర్ లో ఇంకో హిట్ ఖాతాలో వేసుకుంటుందో లేదో చూడాలి .

Also Read: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు!

Advertisment
Advertisment
Advertisment