/rtv/media/media_files/2025/02/28/ZY9lqBfy8HgaDMOmCgLo.jpg)
pooja hegde remuneration for cooli special song
Pooja Hegde: నటి పూజ హెగ్డే రజినీకాంత్ 'కూలీ' లో స్పెషల్ సాంగ్ చేస్తుండడం ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపుతోంది. ఇప్పటికే రజినీతో మిల్కీ బ్యూటీ తమన్నా ''రా నువ్ కావాలయ్యా'' ఐటమ్ నెంబర్ తో ట్రెండ్ సృష్టించగా.. ఇప్పుడు పూజ సూపర్ స్టార్ తో ఎలాంటి సాంగ్ లో కనిపించబోతుంది? అనే క్యూరియాసిటీ ఎక్కువైపోయింది. ఇది ఇలా ఉంటే.. ఈ స్పెషల్ సాంగ్ కోసం బుట్టబొమ్మ తీసుకుంటున్న రెమ్యునరేష్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Chhaava: ఛత్రపతి మహారాజ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్.. 'ఛావా' ఇప్పుడు తెలుగు వెర్షన్ లో కూడా
Yes, you guessed it right!❤️🔥 @hegdepooja from the sets of #Coolie @rajinikanth @Dir_Lokesh @anirudhofficial @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @anbariv@girishganges @philoedit @Dir_Chandhru @PraveenRaja_Off pic.twitter.com/SThlymSeog
— Sun Pictures (@sunpictures) February 27, 2025
పూజ రెమ్యునరేషన్
ఆమె పూర్తి నిడివి గల చిత్రానికి తీసుకునే రెమ్యునరేషన్.. స్పెషల్ సాంగ్ కోసం తీసుకుంటున్నట్లు సమాచారం. 'కూలీ' స్పెషల్ సాంగ్ చేయడానికి పూజ రూ. 2కోట్లు తీసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో టాక్. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ పాట చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభమైంది. గతంలో రామ్ చరణ్ తో కలిసి చేసిన 'జిగేలు రాణి' ఐటమ్ నెంబర్ సూపర్ హిట్ గా నిలిచింది. మరి ఇప్పుడు రజినీతో కూడా ఇదే వర్కౌట్ అవుతుందా? చూడాలి.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఈ మూవీలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ వంటి స్టార్ కాస్ట్ కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈమూవీ మే1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Sankranthiki Vasthunam: ఫైనల్లీ 'సంక్రాంతికి వస్తున్నాం' ఓటీటీ డేట్ ఫిక్స్.. టీవీలో కూడా అదే రోజు?