Jr NTR: ఎన్టీఆర్ ఒక్క రూపాయి ఇవ్వలేదు.. అభిమాని తల్లి ఆవేదన, వీడియో వైరల్

'దేవర' రిలీజ్ కి ముందు జూనియర్ ఎన్టీఆర్.. క్యాన్సర్ తో పోరాడుతున్న తన అభిమానితో వీడియో కాల్ లో మాటాడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తారక్, అతని ట్రీట్మెంట్ కు సాయం చేస్తానని మాటిచ్చారు. కానీఎన్టీఆర్ నుంచి ఎలాంటి సాయం అందలేదని అభిమాని తల్లి మీడియాతో చెప్పారు.

New Update
ntr fan mother

ntr fan mother

ఇటీవల 'దేవర' సినిమా రిలీజ్ కు ముందు జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అయిన కౌశిక్ అనే బాలుడు క్యాన్సర్‌తో బాధపడుతూ తాను చనిపోయేలోపు 'దేవర' సినిమా చూడాలని చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దాంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, బాలుడిని ఎన్టీఆర్‌తో వీడియో కాల్ ద్వారా కలిపించారు. 

దాంతో ఎన్టీఆర్.. తన అభిమానితో వీడియో కాల్ మాట్లాడారు. అలాగే వాళ్ళ పేరెంట్స్ కి ధైర్యం చెప్పి, బాలుడికి కావాల్సిన వైద్య ఖర్చులన్నింటిని భరిస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆ రోజు ఎన్టీఆర్ చెప్పినట్లు తమకు ఎలాంటి సాయం చేయలేదని బాలుడి తల్లి తాజాగా మీడియా వేదికగా చెప్పారు. 

Also Read : ఒకే వేదికపై బాలయ్య, ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కు పండగే

తన కొడుక్కి బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ అయింది. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అందుకే మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి మీడియా ముందుకొచ్చాను అని చెప్పిన ఆమె.. కొడుకు ట్రీట్మెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎలాంటి సాయం అందలేదని అన్నారు.

ఎన్టీఆర్ నుంచి రెస్పాన్స్ లేదు..

" ఎన్టీఆర్ మా కొడుకు వైద్య సహాయానికి డబ్బులు ఇస్తానని చెప్పినప్పటికీ, ఆయన నుండి ఎలాంటి ఆర్థిక సాయం రాలేదు. ఆయన వీడియో కాల్ లో మాట్లాడిన తర్వాత కొందరు నా దగ్గరకు వచ్చి మేము మీకు సాయం చేస్తామని అన్నారు. ఆ తర్వాత మూడు రోజుల వరకు హెల్ప్ కోసం వేచి చూశా. ఎవ్వరూ సాయం చేయలేదు.

ప్రభుత్వం ద్వారా 11 లక్షలు, టీటీడీ ద్వారా 40 లక్షల ఆర్థిక సహాయం అందింది.ఆ డబ్బుతోనే బాబుకు ట్రీట్మెంట్ చేయించాం. ప్రస్తుతం మా బాబు చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఆసుపత్రి వాళ్ళు ఇంకా 20 లక్షలు కట్టాలని అడుగుతున్నారు.." అంటూ ఎమోషనల్ అయ్యారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్స్.. ఇప్పటికైనా ఎన్టీఆర్.. తన అభిమానికి సాయం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు