Niharika Konidala : అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే తాజాగా ఈ ఘటన పై మెగా డాటర్ నిహారిక తొలి సారి స్పందించింది. ఇటీవలే తన నెక్స్ట్ మూవీ 'మద్రాస్ కారన్' ప్రమోషన్స్ పాల్గొన్న నిహారిక ఓ ఇంటర్వ్యూ లో దీని గురించి ప్రస్తావన రాగా మాట్లాడారు. సంధ్యా థియేటర్ ఘటన తనను ఎంతో బాధించిందని. అలాంటి సంఘటనలు ఎవరూ ఊహించరు. మహిళ మృతి గురించి తెలియగానే మనసు ముక్కలైందని అన్నారు. అందరి ప్రేమాభిమానాలు, సపోర్ట్ తో అల్లు అర్జున్ ఇప్పుడిప్పుడే ఆ భాద నుంచి కోలుకుంటున్నారని తెలిపారు. ఇప్పటి వరకు మెగా హీరోలెవరు ఈ ఘటన పై స్పందించలేదు. ఈ క్రమంలో నిహారిక మాట్లాడడం వైరల్ గా మారింది. ఇది కూడా చూడండి: తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్ ది సీన్స్! ట్రైలర్ చూశారా మద్రాస్ కారన్ చాలా కాలం గ్యాప్ తర్వాత నిహారిక హీరోయిన్ గా తెరపై కనిపించబోతుంది. షాన్ నిగమ్, నిహారిక ప్రధాన పాత్రలో నటించిన మద్రాస్ కారన్ జనవరి 10న విడుదల కానుంది. వాలి మోహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నిహారిక ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత రెండు, మూడు సినిమాలు చేసిన నిహారిక.. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ గా కనిపించబోతుంది. మరో వైపు తన ప్రొడక్షన్ లో సినిమాలు చేస్తూ ప్రొడ్యూసర్ గా కూడా రాణిస్తోంది. ఇది కూడా చూడండి: పునర్వివాహం చేసుకున్న మహిళకు ఆస్తిలో వాటా.. హైకోర్టు సంచలన తీర్పు Also Read: Sneha Reddy: అరెస్ట్ తర్వాత బన్నీ భార్య తొలి పోస్ట్ వైరల్.. అందులో ఏముందంటే?