Manchu Manoj: మ్యూజిక్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన మంచు మనోజ్.. న్యూ జర్నీ స్టార్ట్..!

మంచు మనోజ్ కొత్తగా మోహన రాగ మ్యూజిక్ అనే మ్యూజిక్ లేబుల్‌ను ప్రారంభించారు. సంగీతంపై ఉన్న ప్రేమతో ఈ ప్రయాణం మొదలైంది. కొత్త ప్రతిభను ప్రోత్సహించడం, ఒరిజినల్ పాటలు, అంతర్జాతీయ కోలాబరేషన్స్ చేయడం ఈ మ్యూజిక్ లేబుల్ లక్ష్యమని ఆయన తెలిపారు.

New Update
Manchu Manoj

Manchu Manoj

Manchu Manoj: టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఈసారి సినిమా కాదు… సంగీత రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన కొత్త మ్యూజిక్ లేబుల్ ‘మోహన రాగ మ్యూజిక్’(Mohana Raga Music) అధికారికంగా ప్రారంభమైంది. సంగీతం తనకు ఎప్పటినుంచో ప్రత్యేకమని, ఈ కల తనకే కాదు వారి కుటుంబంలో కూడా చాలా కాలంగా ఉందని మనోజ్ భావోద్వేగంగా చెప్పారు.

Also Read :  ప్రభాస్ ఫ్యాన్స్‌కి స్పెషల్ ట్రీట్.. ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ ‘రెబల్ సాబ్’ రేపే!

Manchu Manoj Started New Music Label Mohana Raga Music

Also Read :  "ఒరేయ్ ఆంజనేలూ…" ‘అమృతం’ 2.O వచ్చేస్తోంది..!

మనోజ్ నటుడిగా అందరికీ తెలిసిన వ్యక్తి. చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటిస్తూ, బిందాస్, కరెంట్ తీగ, పోటుగాడు వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక మార్క్ సంపాదించారు. యాక్షన్ సీన్స్‌ను తానే చేయడం, తన సినిమాల క్రియేటివ్ పార్ట్‌లో పాల్గొనడం ఆయనలోని ప్రత్యేకత.

అయితే సంగీతంపై ప్రేమ మాత్రం ఇప్పటిదాకా ఎక్కువ మందికి తెలియదు. ఆయన పోటుగాడులో "ప్యార్ మే పడిపోయా" పాటను పాడారు. కరోనా సమయంలో "అంతా బాగుంటాండ్రా" అనే సున్నితమైన పాటను కూడా విడుదల చేశారు. అంతేకాదు పిస్తా పిస్తా, ఎన్నో ఎన్నో, ప్రాణం పోయే బాధ వంటి పాటలకు లిరిక్స్ కూడా రాశారు. అతని గళం ప్రత్యేకమైన ఎమోషన్ ని వ్యక్తం చేస్తుంది. - tollywood-news-in-telugu

అంతేకాదు, తన తండ్రి డాక్టర్ మంచు మోహన్ బాబు, అన్న మంచు విష్ణు, అక్క లక్ష్మీ మంచు సినిమాల్లో కూడా సంగీతం, యాక్షన్ విభాగాల్లో పనిచేశారు. కొన్నిచిత్రాల్లో రాప్ కూడా చేశారు. హాలీవుడ్ సినిమాలో (Basmati Blues) సంగీత దర్శకుడు అచ్చు రాజమణితో కలిసి పనిచేయడం ఆయన సంగీత ప్రయాణాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది.

ఇప్పుడు ‘మోహన రాగ మ్యూజిక్’ ద్వారా కొత్త ప్రతిభను ప్రోత్సహించడం, కొత్త సంగీత ప్రయోగాలు చేయడం, విభిన్న సాంస్కృతిక నేపథ్యాల్ని కలిపే పాటలను రూపొందించడం ఆయన లక్ష్యం. ఈ పేరుకు మనోజ్‌కు, మోహన్ బాబుకు ప్రత్యేకమైన భావం ఉందని ఆయన తెలిపారు.

కొత్త మ్యూజిక్ లేబుల్ త్వరలోనే ఒరిజినల్ పాటలు, స్పెషల్ కోలాబరేషన్స్, కొత్త ప్రయోగాత్మక ప్రాజెక్టులు విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. అంతర్జాతీయ స్థాయి సహకారం కూడా త్వరలో ప్రకటించనున్నారని సమాచారం. దీనితో తెలుగు సంగీతాన్ని ప్రపంచానికి మరింత దగ్గర చేయాలన్న మనోజ్ ఆశ.

Advertisment
తాజా కథనాలు