యువతకు కిక్కు ఇస్తున్న.. మ్యాడ్ స్క్వేర్ స్వాతి రెడ్డి సాంగ్

మ్యాడ్ స్క్వేర్ నుంచి స్వాతి రెడ్డి లిరికల్ సాంగ్ విడుదలైంది. సురేశ్ గంగుల సాహిత్యంలో భీమ్స్, స్వాతి రెడ్డి ఈ పాటను పాడగా.. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, రెబా మోనిక చిందులేశారు. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ పాట యువతకి కిక్కు ఇస్తోంది.

New Update

గతేడాది రిలీజ్ అయిన మ్యాడ్ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా కామెడీ, పాటలు అన్ని కూడా కూడా యవతను బాగా ఆకర్షించాయి. తక్కువ బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్లు రావడంతో ఈ మ్యాడ్ స్క్వేర్‌ను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో వస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న థియేటర్లలో విడుదల కానుంది.

ఇది కూడా చూడండి:  KTR: వార్తాసంస్థలపై చట్టపరంగా చర్యలు–కేటీఆర్

ఇది కూడా చూడండి: Weather: రుతుపవనాల సీజన్‌ లో అల్పపీడనాలు..ఎందుకింత తీవ్రం!

ఎవరూ ఊహించని విధంగా..

మ్యాడ్ సినిమాలో ఉన్న నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మ్యాడ్ స్క్వేర్‌లో హీరోలుగా చేస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ పాట రిలీజ్ అయ్యింది. నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి అంటూ లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సురేశ్ గంగుల సాహిత్యంలో భీమ్స్, స్వాతి రెడ్డి ఈ స్వాతి రెడ్డి పాటను పాడారు. ఎవరూ ఊహించని హీరోయిన్ రెబా మోనిక ఇందులో చిందులేశారు. 

ఇది కూడా చూడండి:  AP: పవన్ కల్యాణ్ పర్యటనలో నకిలీ సెక్యూరిటీ సూర్యప్రకాష్ కథ ఇదే..

ఈ పాటకి కాస్త డీజే మిక్స్ చేయడంతో సాంగ్ అదిరిపోయింది. పాటను విడుదల చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే యువతకి కిక్కు ఇస్తుంది. ఈసారి న్యూ ఇయర్ పాట ఇదేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మ్యాడ్ స్క్వేర్ కూడా హిట్ కావడం పక్కా అని నెటిజన్లు అంటున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు