పుష్ప-2 మూవీ లిరీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందింది. ఈ విషాద ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని సినిమాటోగ్రఫి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తోపాటు బెనిఫిట్ షోలో చూడటానికి సంధ్య థియేటర్ కు వచ్చారు. ఆయన్ని చూడటానికి అభిమానులుందరూ ఒక్కసారిగా ఎగబడ్డారు. అందులో తొక్కిసలాటై రవళి అనే మహిళ చనిపోయింది. ఇది కూడా చదవండి : కీర్తి సురేష్ వెడ్డింగ్ కార్డ్ .. ఇందులో స్పెషాలిటీ ఇదే..! ఆ సంఘటన బాధ కలిగించింది సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన బాధ కలిగించిందని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రేవతి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఇకనుంచి బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వమని తేల్చి చెప్పారు. హీరోలు అలాంటి టైంలో వెళ్ళడం కరెక్టేనా?, చట్ట పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. హీరో, చిత్ర యూనిట్ స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ఇది కూడా చదవండి : అల్లు అర్జున్ హౌస్ అరెస్టు.. సంధ్య థియేటర్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు! మనిషి ప్రాణం తీసుకొస్తారా అని చిత్ర యూనిట్ ను మంత్రి కోమటి రెడ్డి ప్రశ్నించారు. సినిమా హీరో, ప్రొడ్యూసర్స్ ని బాధితులను ఆదుకోవాలని కోరారు. వేలకోట్ల కలక్షన్స్ అని చెప్తున్నారు కదా.. అందులో బాధితులకు రూ.25లక్షలు ఇచ్చి ఆ కుటంబాన్ని ఆదుకోవాలని సూచించారు.