/rtv/media/media_files/2024/10/18/UeOtPG6T86ky7yR3Vmih.jpg)
Shekar Basha
బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాసాపై మరో కేసు నమోదైంది. ఇటీవల శేఖర్ బాసాపై ఓ కేసు నమోదు కాగా.. తాజాగా మరో కేసు నమోదైంది. కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ శేఖర్ బాషాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. శేఖర్ బాషా తన కాల్ రికార్డింగ్ చేశారని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పరువుకు భంగం కలిగించారని శ్రేష్టి కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు బీఎన్‌ఎస్ 67, 79 సెక్షన్ల కింద శేఖర్ బాషాపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా శ్రేష్టి గతంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఇది కూడా చూడండి: గవర్నమెంట్ టీచర్ : దొరికినకాడికి దోచేసి అడ్డంగా బుక్కయ్యాడు.. సారూ మామూలోడు కాదు!
ఆర్‌జే, బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాసాపై మరో కేసు నమోదైంది. శేఖర్ బాషా తన కాల్ రికార్డింగ్ చేసి, తన పరువుకు భంగం కలిగించారని కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
— RTV (@RTVnewsnetwork) February 6, 2025
Read More:https://t.co/nqQo3TEmkK#SrishtiVarma #RJShekarBasha #RTV
ఇది కూడా చూడండి: Mastan Sai : డ్రగ్స్ ఇస్తాడు.. న్యూడ్ వీడియోలు తీస్తాడు.. మస్తాన్ మాములోడు కాదయ్యా!
రికార్డింగ్‌లు ఉన్నాయని అనడంతో..
ఇటీవల శేఖర్ బాసా ఓ ఇంటర్వూలో శ్రేష్టి వర్మ గురించి మాట్లాడారు. జానీ మాస్టర్‌ని పెళ్లి చేసుకుందామని శ్రేష్టి వర్మ అనుకుందన్నారు. తన కూతురుని చేసుకోమని శ్రేష్టి వర్మ తల్లి జానీని అడిగిందని శేఖర్ బాసా అన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, రికార్డింగ్‌లు కూడా ఉన్నాయన్నారు. ఈ విషయంలోనే ఆమె కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: అప్పర్ సర్క్యూట్‌ను తాకిన వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్.. షేర్ ఎంత శాతం పెరిగిందంటే?