HBD Anushka: నోట్లో సిగార్, ముఖం నిండా రక్తం..కొత్త మూవీ పోస్టర్ సూపర్ నటి అనుష్క - డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న కొత్త సినిమా 'ఘాటి'. ఇవాళ అనుష్క బర్త్ డే సందర్భంగా ఈ మూవీ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో నోట్లో సిగార్ పెట్టుకుని, ముఖంపై రక్తం ఉన్న స్టిల్ ఓ రేంజ్ లో ఆసక్తి రేకెత్తిస్తోంది. By Seetha Ram 07 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి కన్నడ బ్యూటీ అనుష్క శెట్టి అంటే తెలియనివారుండరు. 'సూపర్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన అందం, అభినయం, యాక్టింగ్ తో అదరగొట్టేసింది. ఇందులో నాగార్జున సరసన హీరోయిన్ గా నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. అయితే అప్పటి వరకు ఒకెత్తయితే.. 'అరుంధతి' సినిమాతో ఆమె రేంజ్ మారిపోయింది. Also Read: విడాకుల వేళ.. ఐశ్వర్య- అభిషేక్ లతో స్టార్ డైరెక్టర్ మూవీ ప్లానింగ్ ఈ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దీంతో వరుస సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. అలా ప్రభాస్, అల్లు అర్జున్, సూర్య, రవితేజ, మహేష్ బాబు, గోపీచంద్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మరింత గుర్తింపు సంపాదించుకుంది. ఇక ప్రభాస్ తో 'బాహుబలి' సినిమాలో నటించి పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. Also Read: అనిల్ అంబానీకి షాక్...మూడేళ్ల పాటు ఆ కంపెనీ బంద్! అయితే ఈ సినిమాతో వరుస ఆఫర్లు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దీంతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసింది. వరుసగా భాగమతి. సైజ్ జీరో, నిశ్శబ్దం వంటి సినిమాలు చేసింది కానీ ఏవి క్లిక్ కాలేదు. అలా ఆఫర్లు కరువయ్యాయి. దీని కారణంగా ఇండస్ట్రీకి దూరమైంది. అయితే మళ్లీ ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీలో అదరగొడుతోంది. VICTIM. CRIMINAL. LEGEND.The Queen will now rule the #GHAATI ❤🔥Wishing 'The Queen' #AnushkaShetty a very Happy Birthday ✨#GhaatiGlimpse Video today at 4.05 PM ✨In Telugu, Tamil, Hindi, Kannada and Malayalam.#HappyBirthdayAnushkaShetty@DirKrish @UV_Creations… pic.twitter.com/jgZEBPU5gx — UV Creations (@UV_Creations) November 7, 2024 Also Read: చూపులతో చంపేస్తున్న తెలుగు బ్యూటీ ఈషా.. ఏమి అందం రా బాబు 'ఘాటి' పోస్టర్ ఇటీవలే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో 'ఘాటి' అనే మూవీ చేస్తుంది. ఇవాళ అనుష్క బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో అనుష్క సిగార్ పీలిస్తూ.. కోపంతో ముఖం నిండా రక్తంతో ఉన్న స్టిల్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. Also Read: కేతిక ఖతర్నాక్ పోజులు..వర్త్ వర్మ వర్త్, రెండు కళ్లు చెదిరిపోయాయ్ వర్మ #anushka-new-movie #tollywood #anushka-shetty మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి