పాటతో కుమ్మేసిన వెంకీ మామ.. బ్లాక్ బస్టర్ పొంగల్‌ పక్కా!

టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. తాజాగా మూడో పాట ప్రొమోను మేకర్స్ విడుదల చేశారు. బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ వెంకీ మామ వేరే లెవల్‌లో పాడారు. దీంతో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

New Update

టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంకాంత్రి కానుకగా 2025 జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా నుంచి మూడో పాటను  డిసెంబర్ 30న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ప్రొమో సాంగ్‌ను మూవీ టీం విడుదల చేసింది.

ఇది కూడా చూడండి: యువతకి కిక్కు ఇస్తున్న.. మ్యాడ్ స్క్వేర్ స్వాతి రెడ్డి సాంగ్

ఇది కూడా చూడండి: Weather: రుతుపవనాల సీజన్‌ లో అల్పపీడనాలు..ఎందుకింత తీవ్రం!

ఎనర్జీ లెవెల్స్ వేరే..

ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ మూడో పాటను బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ వెంకీ మామ సూపర్ ఎనర్జీటిక్‌గా పాడినట్లు తెలుస్తోంది. భీమ్స్‌ సిసిరోలియో ఈ పాటకి స్వరాలు సమకూర్చగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం వహించారు. వెంకీ మామ ఎనర్జీ లెవెల్స్ సూపర్‌గా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. టాలీవుడ్‌కి మరో సింగర్ దొరికారని మరికొందరు అంటున్నారు.

ఇది కూడా చూడండి:  AP: పవన్ కల్యాణ్ పర్యటనలో నకిలీ సెక్యూరిటీ సూర్యప్రకాష్ కథ ఇదే..

ఇది కూడా చూడండి:  ISRO: మరో కొత్త ప్రయోగంతో ఇస్రో రెడీ..రేపు PSLV-C60 కౌంట్డౌన్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు