ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2' మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోంది. తో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ.1831 కోట్ల కలెక్షన్స్ రాబట్టి 'బాహుబలి 2' రికార్డులను బద్దలు కొట్టింది. బాలీవుడ్‌లో కూడా తిరుగులేని విజయాన్ని సాధించింది. అక్కడ రూ.806 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో, నాన్-హిందీ సినిమాలలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే, పుష్ప-2 విడుదలకు ముందు రోజు ఒక విషాదకర సంఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు. Also Read : 'అన్ స్టాపబుల్' లో తారక్ ప్రస్తావన.. స్పందించిన నాగవంశీ అరెస్టు సమయంలో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె బన్నీని హత్తుకుంటూ ధైర్యంగా ఉండమని మాటలిచ్చారు. అదే సమయంలో, బన్నీ కూడా తనకు భరోసా ఇచ్చి పోలీసులతో కలిసి వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మొన్ననే బన్నీకి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. బన్నీ అరెస్ట్ తర్వాత స్నేహారెడ్డి తొలిసారిగా పోస్ట్ చేసింది. డిసెంబర్‌లో జరిగిన జ్ఞాపకాలను ఓసారి గుర్తు చేసుకుంది. ఆల్ డిసెంబర్ మూమెంట్స్ ఇన్ వన్ ప్లేస్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇందులో తన పిల్లలు అయాన్, అర్హతో బన్నీ ఆడుకుంటున్న ఫోటోలు కూడా ఉన్నాయి. అరెస్ట్ తర్వాత ఆమె చేసిన తొలి పోస్ట్ కావడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Also Read : ఆస్కార్ బరిలో అట్టర్ ప్లాప్ సినిమా.. నెట్టింట ట్రోల్స్ View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)