Allu Aravind: టికెట్ ధరలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అందుకే అడగలేదు: అల్లు అరవింద్

‘తండేల్‌’ మూవీ టికెట్‌ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వానికి అడగకపోవడానికి గల కారణాన్ని నిర్మాత అల్లు అరవింద్‌ తెలిపారు. తెలంగాణలో మూవీ టికెట్ ధరలు రూ.295, రూ. 395 పెరిగి ఉన్నాయని అన్నారు. అందుకే ఇక్కడ ప్రభుత్వాన్ని ఏమీ అడగలేదని తెలిపారు.

New Update
Allu Aravind thandel movie ticket prices

Allu Aravind thandel movie ticket prices

అక్కినేని నాగచైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ చిత్రానికి సమర్పులుగా ఉన్నారు. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ రెస్పాన్స్ అందుకున్నాయి. దీంతో ఈ సినిమాపై ఫుల్ బజ్ ఏర్పడింది. ఈ చిత్రం రేపు అంటే ఫిబ్రవరి 7న అత్యంత గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ విలేకరుతో ముచ్చటించింది. ఈ సమావేశంలో అల్లు అరవింద్ టికెట్ ధరలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.   

Also Read :  కుల గణన సర్వేపై నెక్స్ట్ స్టెప్ ఇదే.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన!

ఏపీలో అందుకే అడిగాం

ఏపీలో టికెట్ ధరలు పెంచడంపై, అలాగే తెలంగాణలో పెంచకపోవడంపై ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరలు తక్కువగా ఉన్నాయని.. అందువ్లలనే అక్కడ ధరలను పెంచాలని ప్రభుత్వానికి అడిగాం అని అన్నారు. అది కూడా కేవలం రూ.50 మాత్రమే పెంచాలని అడిగామని.. దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అన్నారు. 

Also Read :  తాడేపల్లి వైసీపీ ఆఫీస్ సమీపంలో అగ్ని ప్రమాదం

తెలంగాణ ప్రభుత్వానికి అడగలేదు

కానీ తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం తాము టికెట్ ధరలు ఎందుకు అడగలేదో తెలిపారు. తెలంగాణలో టికెట్ ధరలు రూ.295, రూ.395 పెరిగి ఉన్నాయి కాబట్టి అడగలేదన్నారు. కాగా తండేల్‌ సినిమాకు ఎలాంటి బెనిఫిట్ షోలు లేవని.. అందువల్ల అంత బెనిఫిట్ తమకు వద్దని అన్నారు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Also Read :  TDPలో మంగ్లి చిచ్చు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ పై దుమ్మెత్తి పోస్తున్న కేడర్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు