కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భారీ అభిమాన గణం ఉన్న హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు. తమిళ నాట సూపర్ స్టార్ రజినీ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ ఫ్యాన్స్ బేస్ అజిత్ కు ఉంది. నిజానికి అజిత్ బయటి మీడియాకు ఎక్కువగా కనిపించడు. సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉంటాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. Also Read : మోదీతో కపూర్ ఫ్యామిలీ.. కరీనా చేసిన పనికి అంతా షాక్! అందులో తనను అభిమానులు దేవుడు అని పిలుస్తుంటే ఇబ్బందిగా ఉందని.. అలా పిలవవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు." ఇటీవల ముఖ్యమైన కార్యక్రమాల్లో, ఈవెంట్లలో నేను కనిపించినప్పుడు అనవసరంగా నన్ను కడవులే అజిత్ (దేవుడు అజిత్) అంటూ పలువురు స్లోగన్స్ చేస్తున్నారు. ఆ పిలుపులు నన్ను ఎంతగానో ఇబ్బందిపెడుతున్నాయి. From The Desk of AK pic.twitter.com/0W4dspCg26 — Suresh Chandra (@SureshChandraa) December 10, 2024 Also Read : మంచు ఫ్యామిలీకి మీడియా అంటే చులకనా? గతంలోనూ చాలాసార్లు అలా పిలిస్తే చాలు.. నా పేరుకు ఇతర బిరుదులను తగిలించడం నాకు నచ్చడం లేదు. నన్ను నా పేరుతో పిలిస్తే చాలు. ఇకపై ఇలాంటివాటిని ప్రోత్సహించవద్దని కోరుతున్నాను. ఇతరులను ఇబ్బందిపెట్టకుండా హార్ట్ వర్క్ తో జీవితంలో ముందుకు సాగండి. కుటుంబాన్ని ప్రేమించండి.." అంటూ ప్రకటనలో పేర్కొన్నాడు. Also Read : 'కూలీ' కోసం బరిలోకి దిగిన బాలీవుడ్ స్టార్..! BREAKING: Ajith Kumar issues a statement to stop "Kadavuley Ajithey"📝 pic.twitter.com/D1AlQ99rmU — Manobala Vijayabalan (@ManobalaV) December 10, 2024 కాగా అజిత్ గతంలోనూ ఇలాంటి ప్రకటనలు చేశాడు. తనకు స్టార్ ట్యాగ్స్ వద్దని, తల అని పిలవొద్దని, అజిత్ లేదా ఏకే అని పిలవాలని.. ఫ్యాన్స్ ను కోరాడు. ఇక ఆయన సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం విదాముయార్చి, గుడ్ బ్యాడ్, అగ్లీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. Also Read: Mohan Babu: హైకోర్టుకు మోహన్ బాబు!