Allu Arjun: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారి సబ్బతి విష్ణు మూర్తి ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్, సోమాజీగూడలో ప్రెస్ మీట్ జరగనుంది. కమీషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రెస్ మీట్ లో ఘటనకు సంబంధించి ఏం విషయాలు మాట్లాడబోతున్నారు..? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. Also Read: అల్లు అర్జున్ అతి.. ఇదే తగ్గించుకుంటే మంచిది..' సోషల్ మీడియాలో రేవంత్ ఫ్యాన్స్ హల్చల్ ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ ఘటన అల్లు అర్జున్ కారణంగానే జరిగిందని, అతడు రాకపోతే తొక్కిసలాట జరిగేది కాదని, రేవతి కుటుంబం నష్టపోయేది కాదంటూ అసెంబ్లీలో మండిపడ్డారు. అంతేకాకుండా సినిమా ముందే ఇద్దరు చనిపోయారని చెప్పినా అల్లు అర్జున్ మూవీ మొత్తం చూసి వెళ్ళాడని ఆరోపించారు. చాలా బాధేస్తుంది.. మరో వైపు సీఎం వ్యాఖ్యల తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించిన అల్లు అర్జున్.. 30 ఏళ్లుగా సంధ్య థియేటర్ వెళ్తున్నానని.. తాను పర్మిషన్ లేకుండా వెళ్లానని చెప్పడం బాధాకరమని చెప్పాడు. తొక్కిసలాట జరుగుతుందని చెప్పగానే కాసేపటికే థియేటర్ నుంచి వెళ్లిపోయానని.. రోడ్ చేయలేదని తెలిపారు. నాపై తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు చాలా బాధేస్తుందని మాట్లాడారు. థియేటర్ నుంచి ఇంటికి వెళ్ళిపోయిన నెక్స్ట్ డే తెల్లవారు రేవతి చనిపోయిందని తమ టీమ్ చెప్పారని. అప్పటిదాకా తనకు ఆ విషయం తెలియదని అన్నారు. అలాంటిది నా అభిమాని చనిపోయారని తెలిస్తే తట్టుకుంటానా.. లీగల్ కారణాల వల్ల హాస్పిటల్ కి వెళ్ళలేకపోయాను అని వివరించారు. Also Read: అల్లు అర్జున్ అతి.. ఇదే తగ్గించుకుంటే మంచిది..' సోషల్ మీడియాలో రేవంత్ ఫ్యాన్స్ హల్చల్