X Premium Plus: ఎక్స్ యూజర్లకు బిగ్ షాక్.. ప్రీమియం ప్లస్ ధరల పెంపు

ప్రపంచ వ్యాప్తంగా ఎక్స్ ప్రీమియం ప్లస్ ధరలను 40 శాతం పెంచుతున్నట్లు మైక్రో బ్లాగింగ్ వెల్లడించింది. భారత్‌లో ఈ ధర నెలకు రూ.1300 ఉండగా.. ఇకపై రూ.1750గా నిర్ణయించింది. 2025 జనవరి 21వ తేదీ తర్వాత బిల్లింగ్ చేసిన వారికి ఈ ధరలు మాత్రమే వర్తిస్తాయి.

New Update
X Premium plus plans

X Premium plus plans Photograph: (X Premium plus plans)

ఎలాన్ మస్క్ చేతుల్లోకి ఎక్స్ వెళ్లినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఎక్స్ యూజర్లకు ఎలాన్ మస్క్ మరో బిగ్ షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఉన్న ప్రీమియం ప్లస్ ధరలను భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పెంచుతున్నట్లు మైక్రో బ్లాగింగ్ వెల్లడించింది. ప్రీమియం ప్లస్ ధరలను దాదాపుగా 40 శాతం వరకు పెంచినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి:  Baby Bump: పెళ్లికి ముందే బేబీ బంప్ ఫొటోషూట్.. చైనాలో కొత్త ట్రెండ్

ప్రీమియం ప్లస్ యూజర్లకు యాడ్ ఫ్రీ కంటెంట్..

ఇప్పటికే అమెరికా మార్కెట్లో దీని ధరలు పెంచారట. అయితే ఈ  ప్రీమియం ప్లస్ యూజర్లు యాడ్‌ ఫ్రీ కంటెంట్‌ను చూడవచ్చని తెలిపింది. ఈ రూల్ కూడా 2025 జనవరి 21వ తేదీ తర్వాత బిల్లింగ్ చేసిన వారికి మాత్రమే ఈ ధరలు వర్తిస్తాయని తెలిపింది. అయితే ప్రాంతాలు, పన్నుల బట్టి ధరలు మారుతాయి. ఒకవేళ ఈ తేదీ కంటే ముందు బిల్లింగ్ చేస్తే.. ప్రస్తుతం ఉన్న ధరలు మాత్రమే చెల్లించాలి. 

ఇది కూడా చూడండి: YEAR ENDER 2024: దుమ్ములేపిన భారత ఆటగాళ్లు.. ఈ ఏడాది టాప్ 5 క్రీడా విజయాలివే!

గతంలో అమెరికాలో ఎక్స్ ప్రీమియం ధర నెలకు 16 డాలర్లు అనగా రూ.1360 ఉండేది. అదే కొత్త ధరలు అయితే నెలకు 22 డాలర్లు అనగా రూ.1900గా చెల్లించాలి. అయితే భారత్‌లో ఇప్పటి వరకు ఎక్స్ ప్రీమియం ధర నెలకు రూ.1300 ఉండగా.. ఇకపై రూ.1750 చెల్లించాలి. అంటే ఏడాది మొత్తానికి రూ.18,300 ఎక్స్ ప్రీమియం ప్లస్ వారు చెల్లించాలి. భారత్‌తో పాటు కెనడా, నైజీరియా, తుర్కియేలో కూడా ఇంతే పెంపు ఉంటుంది.

ఇది కూడా చూడండి: Food Allergy: ఫుడ్‌ అలర్జీ డేంజర్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

ఇది కూడా చూడండి: GOOD NEWS: IAFలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు.. రూ.10.04 లక్షల ప్యాకేజ్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు