యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందించడంతో పాటు భద్రతాపరంగా వాట్సాప్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటుంది. యాప్ లో బగ్స్ ఉంటే సరిచేయడంతో పాటు తాజా సాంకేతికత అందుకోలేని పాత ఫోన్లకు తన సపోర్ట్ ను నిలిపివేస్తూ ఉంటుంది. Also Read: kadapa corporation: కడప కార్పొరేషన్ లో రచ్చ రచ్చ.. ఎమ్మెల్యే Vs మేయర్ వార్! WhatsApp Update 2025 కొత్త ఏడాదిలోనూ కొన్ని ఫోన్లకు వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. ఇప్పటికీ యూజర్లు ఆ ఫోన్లు వాడుదతుంటే కొత్త ఫోన్లకు అప్‌గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. దాదాపు 9-10 ఏళ్ల క్రితం తీసుకొచ్చిన ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓపెన్‌తో పని చేస్తున్న ఫోన్లకు జనవరి 1 నుంచి వాట్సాప్ తన సేవలను నిలిపివేయనుంది. Also Read: Donald Trump: మస్క్ అధ్యక్షుడవుతారా..?గట్టిగానే సమాధానమిచ్చిన ట్రంప్ ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ వేదికగానూ మోసాలకు పాల్పడుతున్నవేళ...పాత ఫోన్లలో వాట్సాప్ వాడకం శ్రేయస్కరం కాదు. ఆ క్రమంలోనే ఆయా ఫోన్లకు వాట్సాప్ తన సపోర్ట్ నిలిపివేయనుంది. ఐఓఎస్15.1.అంతకంటే పాత వెర్షన్లు వాడుతున్న ఐఫోన్లకూ తన సపోర్ట్ నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ తెలిపింది. ఒకవేళ ఎవరైనా ఇప్పటికీ పాత ఐఫోన్5 ఎస్,ఐఫోన్ 6,ఐఫోన్ 6 ప్లస్ ఫోన్లు వాడుతుంటే వారు కూడా కొత్త ఫోన్లకు అప్‌గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. Also Read: Donald Trump: ట్రంప్ పాలకవర్గంలో మరో భారత్ -అమెరికన్ వ్యాపారవేత్త! ఐఫోన్ యూజర్లకు మే 5 వరకు గడువు ఉంది.శాంసంగ్ గెలాక్సీ ఎస్ 3, మోటో జీ,హెచ్‌టీసీ వన్ ఎక్స్, హెచ్‌టీసీ వన్ ఎస్స్ +,హెచ్‌టీసీ డిజైర్ 500,హెచ్‌టీసీడిజైర్ 601, శాంసంగ్ గెలాక్సీ నోట్2,శాంసంగ్ గెలాక్సీ ఎస్ 4మినీ, మోటో రేజర్ హెచ్‌డీ ,మోటో ఈ 2014, ఎల్జీ ఆప్టిమస్ జీ, ఎల్జీ నెక్స్‌స్ 4,ఎల్జీ జీ 2మినీ, ఎల్‌జీ ఎల్ 90, సోనీ ఎక్స్‌పీరియా.డ్,సోనీ ఎక్స్‌పీరియాటీ,వి వంటి ఫోన్లు ఉన్నాయి. Also Read: Brazil Plane Crash: ఇళ్లను ఢీకొట్టి కుప్పకూలిన విమానం..10 మంది మృతి! దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన ఈ ఫోన్లు ఇప్పటికీ వాడుతుండడం అరుదు. ఒకవేళ ఎవరైనా వాడుతుంటే మాత్రం వాట్సాప్ సేవల కోసం కొత్త ఏడాదిలో కొత్త ఫోన్ కు మారాల్సిందే.