Vivo నుంచి బ్లాక్ బస్టర్ స్మార్ట్‌ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే!

టెక్ బ్రాండ్ వివో తన Vivo X200 సిరీస్‌ను త్వరలో భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ సిరీస్‌లో Vivo X200 and Vivo X200 Pro ఫోన్లు ఉన్నాయి. ఇవి డిసెంబర్ 12 లేదా 13న భారతదేశంలో లాంచ్ అవుతాయని ఓ టిప్‌స్టర్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

New Update
Vivo X200

టెక్ బ్రాండ్ వివో కొత్త కొత్త ఫోన్లను భారతదేశంలో లాంచ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇందులో భాగంగానే తన Vivo X200 సిరీస్‌ను త్వరలో భారత మార్కెట్లోకి తీసుకురానుంది. దీనికి సంబంధించి సరైన తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఓ టిప్‌స్టర్ Vivo X200, Vivo X200 ప్రోకి సంబంధించి లాంచ్ తేదీ, అమ్మకం తేదీలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

Also Read: 17 ఏళ్లలో ఐదింటి కథ ముగిసింది..విమానయాన రంగం కుదేలు!

Vivo X200 సిరీస్ మూడు మోడళ్లతో రానుందని తెలిపాడు. అవి Vivo X200, X200 Pro, X200 Pro Mini అని పేర్కొన్నాడు. ఈ ఫోన్లు ఇప్పటికే చైనాలో ప్రారంభించబడ్డాయి. ఇవి MediaTek Dimensity 9400 SoC లతో పని చేస్తాయి. అలాగే ఇవి Zeiss-బ్రాండెడ్ కెమెరాలను కలిగి ఉంటాయి. 

Also Read : బాలీవుడ్ లో 'పుష్ప'మేనియా.. ప్రీ సేల్స్ బుకింగ్స్ లో నయా రికార్డ్

ఇక ఇప్పుడు డిసెంబర్ 12 లేదా 13న Vivo X200, Vivo X200 Pro ఫోన్లు భారతదేశంలో లాంచ్ అవుతాయని ఆ టిప్‌స్టర్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. అదే విధంగా లాంచ్ అనంతరం ఈ ఫోన్ సేల్స్ డిసెంబర్ 19 నుండి జరుగుతాయని తెలిపాడు. 

Vivo X200 Series Specifications

Also Read: యూపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతం ఇక మహాకుంభమేళ జిల్లా

Vivo India ఇటీవల Vivo X200, Vivo X200 Proల టీజర్‌లను విడుదల చేసింది. ఇవి MediaTek Dimensity 9400 SoC, Zeiss కెమెరాలు, కర్వ్డ్ డిస్‌ప్లేలతో రానున్నట్లు తెలిసింది. అలాగే ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 15పై రన్ అవుతాయి. Vivo X200, Vivo X200 Pro భారతీయ వేరియంట్‌లు వరుసగా 5,800mAh, 6,000mAh బ్యాటరీలను కలిగి ఉంటాయి. ప్రో మోడల్‌లో V3+ ఇమేజింగ్ చిప్, 200-మెగాపిక్సెల్ Zeiss APO టెలిఫోటో కెమెరా ఉంటాయి. 

Also Read: మరో చరిత్ర సృష్టించనున్న ఇస్రో.. డిసెంబర్ 4న సరికొత్త ప్రయోగం

కొత్త ఫోన్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో అందుబాటులో ఉంటాయి. Vivo X200 అక్టోబర్‌లో చైనాలో CNY 4,300 (దాదాపు రూ. 51,000) ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఇది 12GB RAM + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌తో ప్రారంభించబడింది. Vivo X200 Pro అదే వేరియంట్ CNY 5,999 (దాదాపు రూ. 63,000) ప్రారంభ ధరతో వచ్చింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు