/rtv/media/media_files/2025/02/06/cNseqyRERAYfIchFviVm.jpg)
Realme valentines Day sale 2025 start today
రేపటి నుంచి వాలెంటైన్స్ వీక్ ప్రారంభం కానుంది. దీంతో చాలా మంది ప్రేమ జంటలు తమ ప్రియమైన వారికి గిఫ్ట్‌లు ఇచ్చేందుకు ఇష్టపడతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి బ్లాక్ బస్టర్ సేల్ ప్రారంభించింది. తాజాగా ‘రియల్‌మి వాలెంటైన్స్ డే సేల్ 2025’ (Realme valentines Day sale 2025) పేరుతో ఓ సేల్ అందుబాటులోకి తెచ్చింది.
Also Read : TDPలో మంగ్లి చిచ్చు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ పై దుమ్మెత్తి పోస్తున్న కేడర్!
ఈ సేల్ నేటి నుంచి ఫిబ్రవరి 14 వరకు కొనసాగనుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఎయిర్ బడ్స్ వంటి అనేక ఎలక్ట్రానిక్ డివైజ్‌లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. వీటిని రియల్‌మి అఫీషియల్ వెబ్‌సైట్ లేదా అమెజాన్ లేదా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుక్కోవచ్చు. ఏ ఏ ఫోన్లపై ఆఫర్లు, డిస్కౌంట్లు లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రియల్‌మి P1 5G
ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.1,000 కూపన్ డిస్కౌంట్‌తో కేవలం రూ.12,999 లకే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 6/ 128GB, 8/128GB, 8/256GB వంటి మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా రియల్‌మి GT 6T ఫోన్‌ను డిస్కౌంట్‌తో రూ.23,499లకే కొనుక్కోవచ్చు.
Get ready to fall in love with the latest tech, now at irresistible prices! ✨
— realme (@realmeIndia) February 5, 2025
Your favorite #realme and #realmeNARZO devices are up for grabs with amazing Valentine’s offers, with discounts of up to ₹10,000! 💝
Know More: https://t.co/TcoSCTVvmL pic.twitter.com/RJ6HlXvFN9
Also Read : తాడేపల్లి వైసీపీ ఆఫీస్ సమీపంలో అగ్ని ప్రమాదం
రియల్‌మి 13 ప్రో + 5G
ఈ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. అందులో 8/256GB, 12/256GB, 12/512GB వంటి వేరియంట్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.26999 గా నిర్ణయించారు. అదే సమయంలో రియల్‌మి 14 ప్రో+ 5G ఫోన్ 8/ 128GB వేరియంట్ ధర రూ.29999 కంపెనీ నిర్ణయించింది.
రియల్‌మి ప్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ GT 7 Pro మోడల్ 12GB ర్యామ్+ 256GB స్టోరేజీ, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. 12GB ర్యామ్ వేరియంట్ ధర రూ.54999 గా ఉంది. అదే 16GB ర్యామ్ వేరియంట్‌ను రూ.59999 కే సొంతం చేసుకోవచ్చు.
Also Read : కుల గణన సర్వేపై నెక్స్ట్ స్టెప్ ఇదే.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన!
రియల్‌మి నార్జో 70 టర్బో 5G
ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అందులో 6/128GB, 8/128GB వేరియంట్స్ ఉన్నాయి. ఈ ఫోన్ రూ.16999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.
రియల్‌మి C63 5G
ఈ స్మా్ర్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. అందులో 4/128GB, 6/128GB, 8/128GB వేరియంట్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.10999 గా ఉంది.
రియల్‌మి నార్జో N65 5G
రియల్‌మి నార్జో N65 5G స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. అందులో 4GB/128GB, 6GB/128GB, 8GB/128GB వేరియంట్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ రూ.11499 ధరతో అందుబాటులో ఉంది. అలాగే 6GB ర్యామ్ వేరియంట్ రూ.12499, టాప్ వేరియంట్ 8GB ధర రూ.13499గా కంపెనీ నిర్ణయించింది.