Whatsapp: వాట్సాప్..స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాడే మెసేజింగ్ యాప్. అంతగా మన రోజువారీ జీవితాల్లో భాగమైపోయింది. ఒకప్పుడు ఒక నంబర్ తో ఒక ఫోన్ లో మాత్రమే వాట్సప్ ను వినియోగించుకోవడం సాధ్యమైంది.ఇప్పుడు లింక్డ్ డివైజ్ ఆప్షన్ ద్వారా వేరే ఫోన్లలోనూ అదే నంబర్ వాడుకోవచ్చు. Also Read: ఆసీస్ గడ్డపై తెలుగు కుర్రాడి ప్రభంజనం.. టెస్టు కెరీర్లో తొలి సెంచరీ నమోదు! ఇది ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం..వ్యాపారానికి సంబంధించి ఒక వాట్సాప్ నంబర్ వాడుతున్నప్పుడు వేర్వేరు పని సమయాల్లో వేర్వేరు వ్యక్తులు వాడాల్సి ఉంటుంది.అలాంటి సందర్భాల్లో ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.పొరపాటున ఓ వ్యక్తి తనతో పాటు వాట్సాప్ నంబర్ ఉన్న ఫోన్ పట్టుకెళ్లినా..రెండో డివైజ్‌లో ఉన్న వాట్సాప్ ద్వారా కార్యకలాపాలు కొనసాగించొచ్చు. Also Read: పుష్ప స్టైల్లో నితీశ్ రెడ్డి.. వీడియో చూస్తే గూస్బంప్స్ రావాల్సిందే! అంతేకాదు రెండు ఫోన్లు ఉండేవారు..ఒక ఫోన్ మాత్రమే తీసుకెళ్లాలనుకునే సందర్భంలోనూ ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. సాధారణంగా వాట్సాప్ వెబ్ కు మన ఫోన్ కనెక్ట్ చేయడం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.చాలా సింపుల్ గా ఆ ప్రక్రియను పూర్తి చేయోచ్చు. వేరే ఫోన్ కు కనెక్ట్ చేయడమనేది కాస్త భిన్నం. Also Read: కన్నీళ్లు పెట్టించే నితీష్ రెడ్డి బయోగ్రఫీ.. కొడుకు కోసం ఉద్యోగాన్ని వదులుకున్న తండ్రి ముందుగా మీ ప్రైమరీ ఫోన్ లో కుడివైపు ఉండేత్రీ డాట్స్ మెనూను ఓపెన్ చేసి...అందులో లింక్డ్ డివైజెస్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అప్పుడు క్యూఆర్ కోడ్ స్కానర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు రెండో ఫోన్ తీసుకుని అందులో వాట్సాప్ యాప్ ను ఇన్ ్టాల్ చేసుకోవాలి. లాగిన్ అయ్యే సందర్భంలో ఫోన్ నంబర్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. Also Read: స్టుపిడ్ షాట్.. గెట్అవుట్ ఫ్రమ్ డ్రెస్సింగ్ రూమ్: సన్నీ ఫైర్ అక్కడో క్యూ ఆర్ కోడ్ వస్తుంది.దీంతో ప్రైమరీ ఫోన్ తో లాగిన్ అవ్వాలి. ఆ పై రెండు ఫోన్లలోనూ వాట్సాప్ వినియోగించుకోవచ్చు.