/rtv/media/media_files/2025/02/06/0CsImfvoX0M4vlWMuATu.jpg)
Honda Activa 7G launching soon in india
Honda Activa 7G: ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ హోండా కొత్త కొత్త వెహికల్స్ లాంచ్ చేస్తూ వస్తోంది. తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లు గల వాహనాలను అందించి వినియోగదారులను అట్రాక్ట్ చేస్తోంది. ముఖ్యంగా ఈ కంపెనీ యాక్టివా స్కూటర్ సిరీస్‌తో బాగా పేరు సంపాదించుకుంది. ఈ స్కూటర్‌లో కంటిన్యూగా అప్డేటెడ్ వేరియంట్స్ అందిస్తూ కస్టమర్ల మనసు దోచుకుంటోంది.
Also Read : TDPలో మంగ్లి చిచ్చు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ పై దుమ్మెత్తి పోస్తున్న కేడర్!
Honda Activa 7G
ఇప్పుడు ఈ సిరీస్‌లో మరో మోడల్‌ను తీసుకొచ్చేందుకు కంపెనీ సిద్ధమైంది. హోండా యాక్టివా స్కూటర్‌లో ఇప్పటికి 6జీ సిరీస్ అందుబాటులో ఉంది. అయితే త్వరలో మరో అడుగు ముందుకేసిన కంపెనీ 7జీ సిరీస్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ 7జీ హోండా యాక్టివా స్కూటర్ అధునాతన, అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది.
ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కంపెనీ అందిస్తోంది. ఈ స్కూటర్‌లో LED హెడ్‌లైట్‌తో పాటు ముందు డిస్క్ బ్రేక్‌ను కూడా అమర్చారు. ఇదిమాత్రమే కాదు.. మరెన్నో కొత్త ఫీచర్లను సైతం ఈ స్కూటర్‌లో అందించినట్లు తెలుస్తోంది.
Also Read : తాడేపల్లి వైసీపీ ఆఫీస్ సమీపంలో అగ్ని ప్రమాదం
మైలేజీ వివరాలు
ఇది 110cc సింగిల్-సిలిండర్ ఫ్యూయల్-ఇంజెక్ట్ చేయబడిన ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 7.6 bhp పవర్, 8.84Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. అంతేకాకుండా ఈ స్కూటర్ లీటర్ పెట్రోల్‌కి 68 కి.మీ మైలేజీని అందిస్తుందని సమాచారం. అలాగే రాబోయే స్కూటర్ టెలిస్కోపిక్ ఫోర్క్, ప్రీలోడ్-అడ్జస్టబుల్ మోనోషాక్‌ను పొందగలదు. ఈ స్కూటర్ వీల్స్ విషయానికొస్తే.. ఇందులో 12-అంగుళాల ఫ్రంట్ వీల్, 10-అంగుళాల బ్యాక్ వీల్‌ను అందించారు. ఇది పలు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. అదే సమయంలో వివిధ కలర్ ఆప్షన్లను కలిగి ఉంటుంది.
Also Read : కుల గణన సర్వేపై నెక్స్ట్ స్టెప్ ఇదే.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన!
అయితే దీని అఫీషియల్ లాంచ్ తేదీ ఇంకా ప్రకటించలేదు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ స్కూటర్ ఏప్రిల్ 2025లో భారతదేశంలో లాంచ్ కానుందని భావిస్తున్నారు. కాగా భారత మార్కెట్లో హోండా యాక్టివా 7G టీవీఎస్ జూపిటర్ (110)కి ప్రత్యర్థిగా ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. ఈ స్కూటర్‌లో హోండా 6జీ మాదిరి ఫీచర్లే ఉంటాయని భావిస్తున్నారు.
ధర వివరాలు
ఇదిలా ఉంటే వాహన ప్రియులందరూ హోండా Activa 7G ధర ఎంత ఉంటుందో తెలుసుకోవాలని తహతహలాడుతున్నారు. దీని గురించి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ.. సమాచారం ప్రకారం.. హోండా Activa 7G భారతదేశంలో రూ. 80,000 నుండి రూ. 90,000 మధ్య ప్రారంభించబడుతుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం త్వరలో వెల్లడికానుంది.