ఈ ఏడాది డిసెంబర్ 21న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ క్రమంలో బ్రాండెడ్ దుస్తులపై జీఎస్టీ పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం ముందుగానే షాపింగ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగిన తర్వాత బ్రాండెడ్ రెడీమేడ్ దుస్తులు అన్ని ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చూడండి: హరీష్ రావుకు బిగ్ షాక్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ వారెంట్!? నాలుగు శ్లాబ్‌లలో జీఎస్టీ.. ప్రస్తుతం రెడీమేడ్ దుస్తులపై నాలుగు శ్లాబ్‌లలో జీఎస్టీ వసూలు చేస్తున్నారు. వీటిపై పన్ను 5 నుంచి 28 శాతం వరకు వసూలు చేస్తున్నారు. కానీ జీఎస్టీ సమావేశం తర్వాత దీన్ని పెంచనున్నట్లు తెలుస్తోంది. రూ.1,500 వరకు ఉన్న దుస్తులపై 5శాతం జీఎస్టీ, రూ.1,500 నుంచి 10,000 మధ్య బట్టలపై 18శాతం జీఎస్టీ, రూ.10,000 కంటే ఎక్కువ ఉన్న దుస్తులపై 28 శాతం జీఎస్టీ విధించింది. ఇది కూడా చూడండి: Ganja:ఈ చాక్లెట్లు తింటే సకల రోగాలు మటు మాయం.. తనిఖీల్లో సంచలన నిజాలు! అదే డిసెంబర్ 21 తర్వాత అయితే అన్ని రెడీమేడ్ దుస్తులపై 28 శాతం జీఎస్టీ పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. మొత్తం 148 వస్తువులపై జీఎస్టీ రేట్లలో మార్పులు చేయనున్నారు. అయితే దీనిపై డిసెంబర్ 21న కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోనుంది. వీటితో పాటు శీతల పానీయాలు, సిగరెట్‌లు, పొగాకు వంటి వాటిపై కూడా జీఎస్టీ పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటిపై కూడా జీఎస్టీని 35 శాతానికి పెంచనున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చూడండి: YCP నాయకుడి దౌర్జన్యం..నగ్న వీడియోలతో బెదిరించి, 2 ఏళ్లు అత్యాచారం! ఇదిలా ఉండగా ఇటీవల అక్టోబర్‌లో కూడా ఓ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రలు బృందం 20 లీటర్ల కంటే ఎక్కువ ఉన్న ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌పై జీఎస్టీని తగ్గించాలని ప్రతిపాదించారు. జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించాయి. అలాగే సైకిళ్లపై, బూట్లపై, చేతి గడియారాలపై జీఎస్టీని తగ్గించాలని గత సమావేశంలో ప్రతిపాదించాయి. ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తులకు అలర్ట్..భారీ వర్షాలతో క్లోజ్ అయిన పెద్ద పాదం మార్గం!