ఏపీలోని కూటమి ప్రభుత్వం పాలనపై వైసీపీ అధినేత, మాజీ సీఎం తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత విపరీతంగా ఉందని అన్నారు. ఇవాళ తాడేపల్లిలోని తన కార్యాయలంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రీజినల్ కోఆర్డినేటర్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. సూపర్ 6 హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. విచ్చల విడిగా అవినీతి జరుగుతోందన్నారు. అంతేకాకుండా కరెంటు ఛార్జీలతో బాదుడే బాదుడు అని ఆరోపించారు. Also Read: ఫడ్నవీస్ కే పట్టం.. ఆయనను మళ్లీ సీఎం చేసిన 6 ముఖ్య కారణాలివే! రైతుల సమస్యలపై ర్యాలీ కేసులు మాన్యుఫ్యాక్చర్ చేసి మీరే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజల తరపున గళం విప్పాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. రైతుల సమస్యలపై డిసెంబర్ 11న ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షులు, అలాగే మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఆందోళనలపై కార్యచరణ చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను కూటమి ప్రభుత్వం దగా చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వంపై పార్టీపరంగా పోరుబాటకు జగన్ పిలుపునిచ్చారు. రైతుల సమస్యలు, కరెంటు ఛార్జీలు, ఫీజు రియింబర్స్‌మెంట్‌పై పోరుబాట కార్యాచరణను జగన్ ప్రకటించారు. Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..! రైతుల సమస్యలపై డిసెంబర్ 11న ర్యాలీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అందులో రైతులకు రూ.20 వేల పెట్టుబడి సహాయం, ధాన్యానికి మద్దతు ధర, ఉచిత పంటల భీమా పునరుద్ధరణ చేయాలని బాబు సర్కార్‌ను డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు. అలాగే డిసెంబర్ 27న పెంచిన కరెంటు ఛార్జీలపై ఆందోళన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఎస్‌ఈ కార్యాలయాలు, సీఎండీ కార్యాలయాలకు ప్రజలతో కలిసి వెళ్లి విజ్ఞాపన పత్రాలు అందించే కార్యక్రమం చేపట్టనున్నారు. వెంటనే కరెంటు ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయనున్నారు. అలాగే జనవరి 3న విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్ అంశంపై పోరుబాట ఉంటుందన్నారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ.. విద్యార్థులతో కలిసి జనవరి 3న కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం అందించే కార్యక్రమం చేపట్టనున్నారు.