Dead Body Parcel Case: డెడ్‌బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు అరెస్ట్!

డెడ్‌బాడీ పార్శిల్ కేసులో ప్రధాన నిందితుడు శ్రీధర్‌వర్మతో పాటు ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డెడ్‌బాడీ బర్రె పర్లయ్యదిగా గుర్తించారు. అతడు చేపల చెరువు మీద రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. పర్లయ్యను శ్రీధర్ ఎందుకు చంపాడు? అనేది తెలియాల్సి ఉంది.

New Update
dead body parcel case Police arrest two persons

dead body parcel case Police arrest two persons

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో తులసి అనే మహళకు ఇటీవల పార్శిల్‌లో మృతదేహం రావడం అందరినీ షాక్‌కి గురిచేసింది. ఈ కేసును పోలీసులు ముమ్మరం చేయగా.. సస్పెన్స్ థ్రిల్లర్‌లా రోజుకో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. ఇప్పుడిప్పుడే డెడ్‌బాడీ డెలివరీ కేసులో మిస్టరీ వీడుతోంది. 

ఈ కేసుకు సంబంధించిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు శ్రీధర్ వర్మగా గుర్తించారు. శ్రీధర్ వర్మ మరెవరో కాదు తులసి మరిది. అతడితో పాటు మరో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ డెడ్ బాడీ ఎవరిది అని అందరిలోనూ ఉత్కంఠ ఉండేది. దాన్ని కూడా పోలీసులు కనిపెట్టారు. డెడ్ బాడీ బర్రె పర్లయ్యదిగా పోలీసులు గుర్తించారు.

Also Read: అశ్విన్‌ స్థానంలో మరో యంగ్ స్పిన్నర్‌కు చోటు.. అతడెవరంటే!

 బర్రె పర్లయ్య రోజువారీ కూలీగా చేపల చెరువు మీద పనిచేస్తున్నట్లు తెలిపారు. అయితే పర్లయ్యను శ్రీధర్ ఎందుకు చంపాడు..?. మృతదేహాన్ని వదిన తులసి ఇంటికి ఎందుకు పార్శిల్ చేశాడు..?. వదిన తులసితో శ్రీధర్ వర్మకు ఆస్తి గొడవలు గొడవలు ఏమైనా ఉన్నాయా?.

నిందితుడు శ్రీధర్ వర్మ ఇప్పటి వరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇప్పుడు డెడ్‌బాడీ పార్శిల్ చేసే విషయంలో మరో మహిళ సహకారం తీసుకున్నాడు. ఆ మహిళ ఎవరు?.. ఆమెకు శ్రీధర్ వర్మకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనే పలు విషయాలు పోలీసుల విచారణలో తేలనుంది. త్వరలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. 

Also Read:  శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం గంట నుంచి 3 గంటల్లోపే

అసలేమైందంటే..?

ఉండి మండలం యండగండికి చెందిన సాగి తులసి అనే మహిళకు గత  ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది. అయితే తన ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం కోసం రాజమహేంద్రవరం క్షత్రియ సేవా సమితికి దరఖాస్తు పెట్టుకుంది. ఆ ఇల్లు ప్రస్తుతం ప్లాస్టింగ్ స్టేజ్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ క్షత్రియ సంస్థ మహిళ ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తువుల్ని పార్శిల్ ద్వారా పంపిస్తోంది. ఈ మేరకు మొదటి విడతగా క్షత్రియ సేవా సమితి టైల్స్‌ పంపించగా.. మరోసారి పార్శిల్‌లో విద్యుత్ సామాగ్రికి  పంపుతున్నట్లు ఆమెకు తెలిపారు. 

Also Read: రైల్వే శాఖలో 32,438 ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే?

ఇంటి సామాగ్రికి సంబంధించిన పార్శిల్ రాజమహేంద్రవరం నుంచి తులిసికి పంపించారు. రాజమహేంద్రవరం క్షత్రియ సేవా సమితి తులసికి ఫోన్ చేసి పార్శిల్ వచ్చినట్లు  చెప్పారు. ఓ ఆటో డ్రైవర్ ఈ పార్శిల్ తీసుకుని తులసి ఇంటికి వచ్చాడు. ఆ పార్శిల్ తీసుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఓపెన్ చేసి చూడగానే.. అందులో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనపడింది. దీంతో వారంతా షాకయ్యారు. వెంటనే ఆమె స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటనా స్థలానికి వెళ్లారు. ఈ పార్శిల్ రాజమహేంద్రవరం క్షత్రియ సంఘం పంపించినట్లు తెలియగా.. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పార్శిల్ ప్యాకింగ్ దగ్గర నుంచి పార్శిల్ తీసుకొచ్చిన వ్యక్తి వరకు పిలిచి ఆరా తీస్తున్నారు.

ఈ మేరకు పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఆ పార్శిల్‌లో ఒక ఉత్తరం కూడా ఉంది. అందులో రూ.1.30 కోట్లు చెల్లించాలని, లేకపోతే ఇబ్బందులు పడతారని రాసి ఉంది. పార్శిల్‌‌లో బయటపడిన వ్యక్తి వయసు సుమారు 45 ఏళ్లు ఉంటాయని.. అది కూడా ఆ మృతదేహం సగ భాగం మాత్రమే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో తులసి మరిది శ్రీధర్ ప్రధాన నిందితుడిగా ఉండటంతో.. ఇది ఆస్తి గొడవేనంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు