TTD: ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసింది: భూమన కరుణాకర్‌రెడ్డి తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి స్పదించారు. ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసిందని ఆయన ఆరోపించారు. చిత్తశుద్ధిలేని వ్యక్తులకు పగ్గాలిచ్చారని ఆయన మండిపడ్డారు. By Manogna alamuru 09 Jan 2025 in తిరుపతి Latest News In Telugu New Update షేర్ చేయండి టీటీడీని రాజకీయ కేంద్రంగా మార్చారని మాజీ ఛైర్మన్ భూమన కరుణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల ప్రయోజనాలను గాలికి వదిలేశారని..అధికారంలోకి వచ్చింది మొదలు శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీశారని భూమన ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యమే భక్తుల తొక్కిసలాటకు దారి తీసిందని మండిపడ్డారు. ప్రతిపక్షంపై దుష్ప్రచారానికి తిరుమలను, టీటీడీని వాడుకున్నారు. గడచిన ఐదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదు..మరి ఇప్పుడు ఎందుకు జరిగింది అంటూ ప్రశ్నించారు. శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులు తొక్కసలాటకు గురికావడం, అందులో మరణించడం సాధారణమైన విషయం కాదని కరుణారెడ్డి అన్నారు. Also Read: Movies:గేమ్‌ఛేంజర్ టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ టీటీడీ చరిత్రలో ఇదొక చీకటిరోజు... నిన్నటి తిరుపతి చరిత్రలోనే చీకటి రోజని భూమన అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ పాపం మూటగట్టుకుంది అని వ్యాఖ్యానించారు. ప్రచారాలు, ఆర్భాటాలు తప్ప సీఎంకు ఏమీ పట్టవు. గోదావరిలో పుష్కరాల తొక్కిసలాట ఘటన ఇప్పటికీ మనకు చేదు జ్ఞాపకమే. హిందూ ధర్మంమీద భక్తి, శ్రద్ధ ఈ ప్రభుత్వానికి లేకనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. భక్తులకు అందించే సేవలు అత్యంత పవిత్రమైనవి, వాటిని తేలిగ్గా చూడ్డంవల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని భూమన ఆవేదన వ్యక్తం చేశారు. పరమపవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు దర్శనానికి లక్షలాదిమంది వస్తారని అందరికీ తెలుసు. తెలిసీ ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారు? రుపతిలో పోలీసు అధికారుల దృష్టి అంతా రాజకీయంగా కక్ష తీర్చుకునే కేసులపైనే ఉంది. వైయస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడంపైనే వారి దృష్టి అంతా ఉంది అంటూ దుయ్యబట్టారు. తిరుపతి ఎస్పీ టీడీపీ కార్యకర్తగా మారి భక్తుల రక్షణ బాధ్యతలను పట్టించుకోలేదు. అధికారుల మధ్య, పోలీసుల మధ్య సమన్వయం లేదు. శ్రీవారి భక్తుల సేవకన్నా, టీటీడీ ఛైర్మన్‌కు రాజకీయ వ్యాఖ్యానాలే ఎక్కువ. టీటీడీ ఛైర్మన్ తన టీవీ కార్యాలయాలను తిరుమల టిక్కెట్ల విక్రయ కేంద్రాలుగా మార్చారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి అని భూమన కరుణారెడ్డి విరుచుకుపడ్డారు. తొక్కిసలాట ఘటనపై వెంటనే విచారణ జరగాలి. టీటీడీ ఛైర్మన్ సహా, స్థానిక ఎస్పీ, ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలి. అసమర్థ పరిపాలన అందిస్తున్న చంద్రబాబు శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలి అంటూ భూమన డిమాండ్ చేశారు. Also Read: Tirupati Stampede: తొక్కిసలాటకు కారణం అదే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు! #Tirumala Stampede #today-latest-news-in-telugu #bhumana-karunakar-reddy #stampede #ttd మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి