ఇటీవల టీటీడీ పాలకమండలి మీడియా సమావేశం జరిగ్గా.. అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గంటలోపు దర్శనం అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే నాలుగు కంపెనీలు డెమో ఇస్తున్నాయని, వీటిపై ట్రయిల్ రన్ నిర్వహించి తదుపరి చర్యలు తీసుకుంటామని టీటీడీ పాలక మండలి ఛైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా టీటీడీ కార్యక్రమాలు తీసుకెళ్లాలని సీఎం సూచనలు చేశారని టీటీడీ ఈవో శ్యామల రావు అన్నారు. దీనిపై ఓ కమిటీ వేసి నివేదిక ఇవ్వాలని సూచించామన్నారు. ఇది కూడా చూడండి: అశ్విన్ స్థానంలో మరో యంగ్ స్పిన్నర్‌కు చోటు.. అతడెవరంటే! నాణ్యమైన ఆహారాన్ని అందించేలా.. నడక మార్గంలో ఆరోగ్య సమస్యల కారణంగా మరణాలు సంభవించకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలకు ప్రణాళిక వేయనున్నట్లు తెలిపారు. అలాగే భక్తులకు అందించే సేవలపై ఫీడ్ బ్యాక్ సిస్టం కూడా ఏర్పాటు చేయనున్నారు. తిరుమలలోని హోటల్స్ నాణ్యమైన ఆహారాన్ని అందించేలా నూతన పాలసీ రూపొందిస్తామన్నారు. తిరుమలలో జాతీయ బ్రాండెడ్ రెస్టారెంట్లను తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇది కూడా చూడండి: Allu arjun: అల్లు అర్జున్ విచారణ పూర్తి.. కీలక ప్రశ్నలకు సమాధానాలివే! తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించేలా రెస్టారెంట్‌లో ఏర్పాట్లు చేస్తామన్నారు. అలాగే అన్నప్రసాదం విభాగంలో పోస్టులకు భర్తీకి, అదనపు పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఈవో తెలిపారు. కంచి కామకోటి విద్యాసంస్థకు రూ. 2 కోట్లు మంజూరు చేశామన్నారు. దేశంలో ప్రతీ రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆలయాలు నిర్మిస్తామని తెలిపారు. భక్తులకు అందించే సేవలపై ఫిడ్ బ్యాక్‌ని ఏపి డిజిటల్ సహకారంతో స్వీకరించేందుకు నిర్ణయించారు. ఇది కూడా చూడండి: Jani Master: అల్లు అర్జున్ అరెస్ట్ పై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్ వైరల్ ముంబైలో స్వామి వారి ఆలయం 10 ఎకరాల్లో, నవి ముంబైలో 3.5 ఎకరాల్లో పద్మావతి అమ్మవారి ఆలయం నిర్మించడానికి విన్నతి వచ్చినట్లు తెలిపారు. అలాగే క్యూలైన్‌లో టాయిలెట్స్ కట్టాల్సిన అవసరం ఉందని రూ.3 కోట్లతో కాంప్లెక్స్ నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఇతర మఠాలపై నిఘా ఉంచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇది కూడా చూడండి: AP: ఏపీలో దారుణం.. సిబ్బంది నిర్లక్ష్యానికి గర్భిణి మృతి..!