Tirupati Stampede:తిరుపతి ఘటన..తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని

తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. మృతుల పట్ట తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ తొక్కిసలాట ఘటన ఎంతో బాధించిందని, మరణించిన కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

New Update
PM Modi tpt

PM Modi tpt Photograph: (PM Modi tpt)

తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందిన విషాదం గురించి తెలిసిందే. వీరి మృతి పట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ తొక్కిసలాట ఘటన ఎంతో బాధించిందని, మరణించిన కుటుంబాలు అందరికీ కూడా సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని, ఏపీ ప్రభుత్వం బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తుందని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. 

ఇది కూడా చూడండి:  Daaku Maharaaj: బాలయ్యకు బిగ్ షాక్.. డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ క్యాన్సిల్!

ఇది కూడా చూడండి: Tirupati: అంతా రెప్పపాటులో జరిగిపోయింది..తిరుపతి ఘటన టైమ్ టు టైమ్ సీన్

తిరుమల భక్తుల మరణవార్త తీవ్రంగా..

ఇదిలా ఉండగా ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ వద్ద జరిగిన దారుణ ఘటనలో ఆరుగురు భక్తులు మరణించారు.ఈ వార్త తీవ్రంగా కలచివేసిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎక్స్ వేదికగా అన్నారు. వారి మృతి పట్ల సంతాపం తెలిపారు. అలాగే మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇది కూడా చూడండి: Tirupati Stampede: తొక్కిసలాటకు కారణం అదే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

ఇది కూడా చూడండి: TTD: ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసింది: భూమన కరుణాకర్‌రెడ్డి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు