TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ రోజుల్లో ప్రత్యేక దర్శనాలు రద్దు

వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ఏకాదశి దర్శనాలు జరగనుండటంతో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమయంలో ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. అలాగే కేవలం టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే ఉత్తర ద్వార దర్శనానికి అనుమతి ఇవనున్నట్లు తెలిపింది.

New Update
11

తిరుమలలో వైకుంఠ ఏకాదశి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారిని భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకుంటారు. ఈ ఏకాదశి నాడు శ్రీవారిని దర్శించుకుంటే పుణ్యఫలం దక్కుతుందని భక్తులు నమ్ముతారు. ఈ క్రమంలో శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తుంటారు.

ఇది కూడా చూడండి: నేడే ‘బిగ్ బాస్-8’ లాస్ట్ డే.. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు!

టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే..

ఈ వైకుంఠ ఏకాదశి దర్శనాలు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు జరగనున్నాయి. ఈ క్రమంలో టీటీడీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఉత్తర ద్వార దర్శనాలకు టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తామని టీటీడీ తెలిపింది. అలాగే ప్రోటోకాల్ ప్రముఖులు కాకుండా మిగతా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. 

ఇది కూడా చూడండి: YS Sharmila: మరోసారి తన అన్నపై రెచ్చిపోయిన షర్మిల

ఉత్తర ద్వారా దర్శనం జరగనున్న పది రోజుల పాటు గోవిందమాల భక్తులకు, వృద్ధులు, దివ్యాంగులు, పిల్లలకు, ఎన్‌ఆర్‌ఐ వంటి దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ ఛైర్మన్లకు కూడా వైకుంఠ ఏకాదశి రోజు దర్శనాలకు ఎలాంటి అనుమతి ఉండదని తెలిపింది.

ఇది కూడా చూడండి: మరికాసేపట్లో గ్రూప్ - 2 పరీక్ష.. ఈ తప్పు చేశారో ఇంటికే ఇక!

సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో టోకెన్లు తీసుకున్న భక్తులు వారి టైమ్‌స్లాట్ ప్రకారం మాత్రమే కూల్యైన్ల దగ్గరకు వెళ్లాలని టీటీడీ సూచించింది. రోజుకి కొంత లిమిట్ ప్రకారం మాత్రమే టోకెన్లు ఇస్తారు. కొండ కింద పలు ప్రదేశాల్లో టోకెన్లు ఇస్తారు. వీటికి తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి. 

ఇది కూడా చూడండి: Road Accident: అమెరికాలో భారి యాక్సిడెంట్.. తెనాలి విద్యార్థిని మృతి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు