BIG BREAKING: టీటీడీలో రూ.300 కోట్ల కుంభకోణం!

టీటీడీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పరకామణిలో రూ.300 కోట్ల అవినీతి జరిగిందంటూ టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేయటం సంచలనం రేపుతోంది. రూ.200 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ మాయం చేశారని భాను బలమైన ఆరోపణలు చేస్తున్నాడు.

author-image
By srinivas
New Update
TTD

తిరుపతి దేవస్థానం

TTD: టీటీడీలో భారీ కుంభకోణం ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. పరకామణిలో రూ.300 కోట్ల అవినీతి జరిగిందంటూ టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేయటం సంచలనం రేపుతోంది. రూ.200 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ మాయం చేశారని భాను బలమైన ఆరోపణలు చేస్తున్నాడు.

శ్రీవారి హుండీలో నగలు సైతం..

ఈ మేరకు మంగళవారం నిర్వహించిన టీటీడీ బోర్డు సమావేశంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి.. వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటుపై సమీక్షలో పరకామణిలో దాదాపు రూ.100 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి కుంభకోణం జరిగిందని బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి ఛైర్మన్‌కు వివరించారు. దీనిపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఛైర్మన్ బీఆర్ నాయుడుకు వినతి పత్రం అందించారు. 

ఇది కూడా చదవండి: BIG BREAKING: సీఎం దగ్గరకు సీనీ ప్రముఖులు!

రూ.200 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ..


అలాగే పరకామణిలో దాదాపు రూ.200 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని బయటకు తరలించినట్లు అనుమానాలున్నాయని తెలిపాడు. పెద్దజీయర్‌ తరఫున సీవీ రవికుమార్‌ అనే వ్యక్తి విదేశీ కరెన్సీని లెక్కించే వారని, అతన్ని కూడా ఈ అంశంలో విచారించాలని ఫిర్యాదులో సూచించారు భాను ప్రకాశ్. అంతేకాదు కొన్ని సంవత్సరాల క్రితం రవికుమార్‌ రహస్యంగా తన శరీరంలో అర పెట్టించుకున్నారంటూ సంచల ఆరోపణలు చేశాడు. 2023 ఏప్రిల్ 29న రవి కుమార్ శ్రీవారి హుండీ నగదు తరలిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికారని వెల్లడించారు. తాను విజిలెన్స్‌ సహాయ భద్రతాధికారి సతీష్‌కుమార్‌, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రవికుమార్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. కానీ రవికుమార్ ను అరెస్ట్ చేయకుండాలో క్‌ అదాలత్‌లో రాజీకి వచ్చారని విమర్శలు గుప్పించారు. 

టీటీడీ అధికారులు, పోలీసుల హస్తం..


ఇక ఈ మూడు వందలకోట్ల స్కామ్ లో టీటీడీ అధికారులు, పోలీసుల హస్తం కూడా ఉన్నట్లు భాను ప్రకాశ్ తెలిపాడు. కొంతమది రవికుమార్ ను బెదిరించి రూ.100 కోట్ల విలువైన ఆస్తులను రాయించుకున్నారని ఆరోపణలు చేశాడు. ఎప్పటికప్పుడు సాధ్యమైనంత నగదు, బంగారం, తదితర విలువైన వస్తువులను గుట్టు చప్పుడు కాకుండా బటయకు దాటించారని చెప్పాడు. నిందితులు ఎంతటివారైనా సరే కఠినంగా శిక్షించి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను కాపాడాలని కోరారు.  

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు