TTD: డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. తిరుమల శ్రీవారి మాసోత్సవాల్లో ధనుర్మాసాన్ని అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ నెల16వ తేదీ ఉదయం 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబరు 17వ తేదీ నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ మారనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. Also Read: HYD: మనిషివా..మోహన్ బాబువా..సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ ఆగ్రహం సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. డిసెంబర్ 16న మొదలుకానున్న ధనుర్మాసం.. జనవరి 14న ముగియనుంది. ధనుర్మాసం సందర్భంగా తిరుమల శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు. Also Read: Vangalapudi Anitha: ఏపీ హోంమంత్రి అనితకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ ధనుర్మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారికి సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారి ఆలయంలో రోజుకో పాశురం చొప్పున నెల రోజులపాటు అర్చకులు పారాయణం చేస్తారు. అలాగే భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా నిర్వహిస్తారు. Also Read: మోహన్ బాబు, మంచు విష్ణుల వద్ద గన్స్.. స్వాధీనం చేసుకోనున్న పోలీసులు మరోవైపు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సోమవారం సాయంత్రం శ్రవణం కేంద్రాన్ని సందర్శించారు. చిన్నారుల శిక్షణ తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రవణం విద్యార్థులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని బీఆర్ నాయుడు వివరించారు. శ్రవణం కేంద్రంలోని విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. చిన్నారుటు ఉంటున్న భవనానికి మరమ్మత్తులు చేయిస్తామని తెలిపారు. చిన్నారులకు వినికిడి యంత్రాలు సరఫరా చేయాలని, పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు. Also Read: Ap: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్...క్రిస్మస్,సంక్రాంతి కానుకలు! ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, టీటీడీ జేఈవో, శ్రవణం ఇంఛార్జి ఇతర అధికారులు అధికారులు పాల్గొన్నారు.