BREAKING: పవన్‌ కళ్యాణ్‌ను చంపేస్తాం.. వార్నింగ్ ఇస్తూ మెసేజ్‌లు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పేషీకి బెదిరింపు కాల్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది. పవన్‌ను చంపేస్తామంటూ ఆగంతకుడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు సమాచారం. అభ్యంతరకర భాష, వార్నింగ్ ఇస్తూ మెసేజ్‌లు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.

New Update
Deputy CM Pawan Kalyan

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పేషీకి బెదిరింపు కాల్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది. పవన్‌ను చంపేస్తామంటూ ఆగంతకుడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగానే పవన్‌ను ఉద్దేశించి ఆగంతకుడు అభ్యంతరకర భాష, వార్నింగ్ ఇస్తూ మెసేజ్‌లు పెట్టినట్లు తెలుస్తోంది.

Also Read: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్‌!

దీంతో ఈ విషయాన్ని అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పవన్ కళ్యాణ్ పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆగంతకుడిని గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. 

Also Read: ఉద‌యించే సూర్యుడికి శ‌త్రువుగా ఉంది రెండాకుల గుర్తే..!

హోంశాఖ మంత్రి అనిత రియాక్ట్

అదే సమయంలో పవన్ పేషీకి బెదిరింపు కాల్స్‌ రావడంపై రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు డీజీపీ ద్వారక తిరుమలరావుతో మాట్లాడారు. జరిగిన విషయాన్ని డీజీపీ ద్వారక తిరుమల రావు మంత్రి అనితకు వివరించారు. డిప్యూటీ సీఎం పేషీకి రెండు సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. అనంతరం మంత్రి అనిత.. పవన్ కల్యాణ్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్‌ రావడంపై ఆరా తీశారు. 

Also Read: తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాలో భారీ వర్షాలు!

ఇందులో భాగంగానే ఫోన్ కాల్స్, మెసేజ్‌ల వివరాలను డీజీపీకి అడిగి తెలుసుకున్నారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని పట్టుకోవాలని చెప్పారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. వీటి వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదని పేర్కొన్నారు.

Also Read: భారతీయులకు అలర్ట్‌...హెచ్-1బీ వీసా లిమిట్‌పై అప్‌డేట్!

ప్రజా ప్రతినిధుల పట్ల ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని అస్సలు ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇక మంత్రి అనిత ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు బెదిరింపు కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై దర్యాప్తు చేపట్టారు. 

. . . . .

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు