Tirupati: అంతా రెప్పపాటులో జరిగిపోయింది..తిరుపతి ఘటన టైమ్ టు టైమ్ సీన్

తిరుమల శ్రీవారి వైకుంఠద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో నిన్న జరిగిన తోపులాట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇందులో ఆరుగురు భక్తులు చనిపోయారు. అసలు ఏ సమయానికి ఏం జరిగింది. ఎలా జరిగింది అనేది పూర్తి వివరాలు ఈ కింది ఆర్టికల్‌ లో..

New Update
ttd

TIrumala

వైకుంఠ ఏకాదశి రోజు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని  కనులారా దర్శించి తన్మయత్వంలో మునిగి తేలాలనుకున్నారు. కానీ ఆ కళ్లు మరోసారి తెరవని పరిస్థితులు ఏర్పడ్డాయి. టోకెన్లు తీసుకునేలోపే భక్తులు బతుకులు తెల్లారిపోయాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నారు. 

అధికారులు లెక్క తప్పారా..

బైరాగిపట్టేడలోని రామానాయుడు పాఠశాల వద్ద తాకిడి తక్కువగా ఉంటుందనుకున్న భక్తులు బుధవారం ఉదయం నుంచే అక్కడికి చేరుకోవడం మొదలు పెట్టారు. రాత్రికి భక్తులతో ఆ ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. పోలీసులు పక్కనే ఉన్న పద్మావతి పార్కులోకి భక్తులను వదిలి రాత్రి 8.20 కి క్యూలైన్లలోకి అనుమతించారు.

Also Read:  Pawan: తిరుపతి తొక్కిసలాట.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు

మెయిన్‌ గేటు వద్ద ముందుగా వెళ్తున్న భక్తుల మధ్య తోపులాట జరిగింది. దాంతో చాలా మంది కిందపడిపోయారు. అంతే ఒక్కసారిగా ఘోరం జరిగిపోయింది. దీంతో చాలా సేపు భక్తులను క్యూలైన్లలోకి అనుమతించకుండా నిలిపివేసి సహాయ కార్యక్రమాలు చేపట్టడంతో ప్రాణనష్టం తగ్గింది. గాయపడిన భక్తులను పోలీసులే అంబులెన్స్‌ లో చేర్చి హుటాహుటిన స్విమ్స్‌, రుయాకు తరలించారు.

తిరుపతిలోని  పలు టోకెన్ల జారీ కేంద్రాల వద్ద రోడ్ల పై బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులను అనుమతించారు. బైరాగిపట్టెడలో అందుకు భిన్నంగా వ్యవహరించడమే ఈ ప్రమాదానికి ముఖ్య కారణమని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కౌంటర్ వద్ద బాధ్యతలు నిర్వహిస్తున్న డీఎస్పీ రమణకుమార్‌ కు రహదారి పొడవునా బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు సూచించినట్లు తెలుస్తుంది. అయితే ఏ ప్రమాదం జరగదన్న ధీమాతో ఏర్పాటు చేయకపోగా..భక్తులను పార్కులోఉంచి ఒకేసారి  అనుమతించడంతో ఈ ప్రాణ నష్టం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Also Read: భక్తులు భారీగా వస్తారని తెలిసి ఎందుకు ఏర్పాట్లు చేయలేదు..Chandrababu

వారం నంచి కేంద్రాలను టీటీడీ, పోలీసులు పరిశీలించి ఏర్పాట్ల పై చర్చించారు. చివరకు అమలుచేయడంలో ఘోరంగా విఫలమైనట్లు భక్తులు అంటున్నారు.

అసలు ఏ సమయానికి ఏం జరిగింది..


ఉదయం 10 గంటలు: రామానాయుడు ఉన్నత పాఠశాల కౌంటర్‌ వద్దకు పెరిగిన భక్తుల తాకిడి. శ్రీపద్మావతి పార్కులోకి అనుమతి.

మధ్యాహ్నం 2 గంటలకు భక్తులతో నిండిన పార్కు.అదుపు చేసేందుకు భారీగా పార్కు వద్దకు చేరిన పోలీసులు.

రాత్రి 7 గంటలకు పూర్తిగా పార్కు నిండిపోవడంతో ఎటూ కదల్లేని పరిస్థితులు. భక్తులకు తాగునీరు అందించిన పోలీసులు.

రాత్రి 8.20 గంటలు భారీగా పెరిగిన రద్దీ. పార్కు నుంచి టికెట్ల  జారీ కౌంటర్‌ లోకి అనుమతి. ఈక్రమంలో భక్తుల మధ్య తోపులాట. పలువురు కిందపడగా.. వారి పై నుంచి భక్తులు పరుగులు తీయడంతో ప్రాణాపాయం చోటు చేసుకుంది.

రాత్రి 8.40 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్లు, రుయా, స్విమ్స్‌కు గాయపడిన భక్తుల తరలింపు. 

రాత్రి 9.27 గంటలకు టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈవో వీరబ్రహ్మం సంఘటన స్థలానికి చేరుకుని పోలీసు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రాత్రి 9.30 గంటలకు పార్కులోని భక్తులందరినీ క్యూ పద్దతిలో కౌంటర్ లోని క్యూలైన్లలోకి వదిలారు.

Also Read: TTD: ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసింది: భూమన కరుణాకర్‌రెడ్డి

Also Read: Tirupati Stampede: తొక్కిసలాటకు కారణం అదే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు