South Central Railway: సంక్రాంతి పండుగకు ఊరెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇప్పటికే 112 ప్రత్యేక రైళ్లను నడుపుతున్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో 60 రైళ్లు అదనంగా నడపాలని నిర్ణయించింది. Also Read: Madras High Court: మనమందరం సిగ్గు పడాలి.. మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు ప్రత్యేక రైళ్లతో పాటు సాధారణ రైళ్లకు అదనపు బోగీలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ చెప్పారు. వీటితో పాటు మరో 90 పాసింగ్ త్రూ రైళ్లను కూడా నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రత్యేక రైళ్లు, ప్రయాణికుల రద్దీ, రైళ్ల ఏర్పాట్లను దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ చెప్పారు. Also Read: Syria:సిరియా మాజీ అధ్యక్షుడు అసద్ కు సీరియస్..విష ప్రయోగం అని అనుమానం సీపీఆర్వో అధికారి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతేడాది సంక్రాంతికి 70 ప్రత్యేక రైళ్లను నడిపినట్లు వివరించారు. అదే తీరుగా ఈసారి పెరిగే రద్దీని దృష్టిలో ఉంచుకుని దాదాపు 160 నుంచి 170 రైళ్లను కేవలం దక్షిణ మధ్య రైల్వే నడపడం కోసం రెడీ చేస్తున్నట్లు చెప్పారు. గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది భారీ స్థాయిలో స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్లు చెప్పారు. Also Read: Ap Cm Chandra Babu Naidu: విశాఖ, విజయవాడలో మెట్రో రైళ్లు.. ఆ మార్గాల్లో అయితే డబుల్ డెక్కర్ నే అదనపు ఛార్జీలు.. ఈ ప్రత్యేక రైళ్లలో ఛార్జీలు సాధారణ రైళ్లతో పోలిస్తే అదనంగా ఉంటాయని చెప్పారు. స్పెషల్ ట్రైన్స్ అనేవి అదనపు రద్దీ కొరకే నడుపుతున్నందున కొద్ది మొత్తంలోనే అదనపు ఛార్జీలుంటాయని వెల్లడించారు. ప్రత్యేక రైళ్లు కూడా ఎక్స్‌ప్రెస్ రైళ్లలానే ఒకే మార్గంలో ప్రయాణిస్తాయని సీపీఆర్వో శ్రీధర్ అన్నారు. Also Read: Kumbh mela: మరికొన్ని రోజుల్లో మహా కుంభమేళా.. తెలుగు రాష్ట్రాల నుంచి స్పెషల్ ట్రైన్స్