ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను చంపేస్తామంటూ ఓ ఆగంతకుడు సోమవారం ఆయన పేషీకి ఫోన్ చేసి బెదిరించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అసభ్యపదజాలంతో మెసేజ్ పంపించాడు. ఇదే విషయంపై పోలీసులు అలెర్ట్ అయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు Also Read: 'పుష్ప2' జేసీబీ కంటే తోపేమి కాదు.. బన్నీ గాలి తీసేసిన సిద్దార్థ్! ఈ దుశ్చర్యకు పాల్పడిన నూక మల్లికార్జున రావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆ నిందితుడు మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై పోలీసులు రహస్య ప్రాంతంలో నిందితుడ్ని విచారిస్తున్నారు. కాగా 95055 05556 నంబరు నుంచి పవన్ పేషీకి కాల్ వచ్చినట్లు గుర్తించారు. దాని బట్టి ట్రేస్ చేయడంతో ఆ నెంబర్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన మల్లికార్జున రావు పేరుతో ఉన్నట్లు గుర్తించారు. ఇది కూడా చూడండి: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఉన్న టవర్ నుంచి ఆ కాల్ వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. నగర కమిషనర్ రాజశేఖర్ బాబు టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, లా అండ్ ఆర్డర్ విభాలగాలకు చెందిన పోలీసులతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఉన్నట్టుండి మల్లికార్జునరావు ఫోన్ స్విచాఫ్ కావడంతో పోలీసులకు కాస్త కష్టంగా మారింది. కానీ ఎట్టకేలకు పోలీసులు అతడ్ని పట్టుకుని అరెస్టు చేశారు. పవన్ కళ్యాణ్‌ను చంపేస్తాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చింది. పవన్‌ను చంపేస్తామంటూ ఆగంతకుడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చింది. ఇందులో భాగంగానే పవన్‌ను ఉద్దేశించి ఆగంతకుడు అభ్యంతరకర భాష, వార్నింగ్ ఇస్తూ మెసేజ్‌లు పెట్టాడు. Also Read: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్! దీంతో ఈ విషయాన్ని అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పవన్ కళ్యాణ్ పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆగంతకుడిని గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. హోంశాఖ మంత్రి అనిత రియాక్ట్ అదే సమయంలో పవన్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడంపై రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు డీజీపీ ద్వారక తిరుమలరావుతో మాట్లాడారు. జరిగిన విషయాన్ని డీజీపీ ద్వారక తిరుమల రావు మంత్రి అనితకు వివరించారు. డిప్యూటీ సీఎం పేషీకి రెండు సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. అనంతరం మంత్రి అనిత.. పవన్ కల్యాణ్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంపై ఆరా తీశారు. ఇది కూడా చూడండి: అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక! ఇందులో భాగంగానే ఫోన్ కాల్స్, మెసేజ్‌ల వివరాలను డీజీపీకి అడిగి తెలుసుకున్నారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని పట్టుకోవాలని చెప్పారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. వీటి వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధుల పట్ల ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని అస్సలు ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇక మంత్రి అనిత ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు బెదిరింపు కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై దర్యాప్తు చేపట్టారు.