Ap Home MInister: ప్రభుత్వానికి లేదా టీడీపీ ప్రతిష్ఠకు నష్టం జరుగుతుందని భావిస్తే నా పిల్లలననైనా ఊరుకునేది లేదని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఇటీవల తన పీఏను తొలగించడం పై మాట్లాడుతూ..జగదీష్ అనే వ్యక్తి నా ప్రైవేట్ పీఏ. నా సొంత డబ్బుతో జీతం ఇచ్చా.అతడి పై ఆరోపణలొచ్చాయి. Also Read: Prashant Kishor: పోలీసుల అదుపులో ప్రశాంత్ కిషోర్..ఎయిమ్స్ కు తరలింపు! అతన్ని హెచ్చరించా. అయినా ఫిర్యాదులు ఆగకపోవడంతో పది రోజుల క్రితమే ఉద్యోగం నుంచి తొలగించినట్లు వెల్లడించారు. విశాఖ కేంద్ర కారాగారంలోని పెన్నా బ్లాక్ సమీపంలో సెల్‌ఫోన్లు దొరకడం, ఖైదీలకు జైలు సిబ్బంది గంజాయి సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఆదివారం ఉదయం మంత్రి ఆకస్మిక జైలు పరిశీలనకు వచ్చారు. Also Read: Ap: తెల్లారే పింఛన్ ఇవ్వకపోతే ప్రపంచం తలకిందులవుతుందా? వివిధ విభాగాలను తనిఖీ చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో జైలులో సెక్యూరిటీ, నిర్వహణ, ఉద్యోగుల బదిలీలను గాలికొదిలేశారు. రాష్ట్రంలోని జైళ్లు, పోలీసు స్టేషన్లలో కొందరు అధికారులు , సిబ్బంది ఐదేళ్లుగా ఒకే చోట పని చేస్తున్నారు. జైలులో ఏం జరిగినా తెలిసేలా.. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి విషయాన్ని క్షుణ్నంగా పరిశీలించి చర్యలు తీసుకుంటుంది. జైలులో నర్మద బ్లాక్ సమీపంలో చిన్న గంజాయి మొక్క కనిపించినట్లు పేర్కొన్నారు. ఇక పై జైలులో ఏం జరిగినా తెలిసేలా అన్ని చోట్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డీఐజీని ఆదేశించాం. తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని మంత్రి హెచ్చరించారు. ఇటీవల కారాగారంలో సెల్‌ఫోన్లు దొరకడం పై విచారణ ప్రారంభించారం.ఏ నంబర్ సిమ్ ఉపయోగించారు.ఎవరెవరితో మాట్లాడారు..అనే విషయాలు తెలుస్తాం. నివేదిక ఆధారంగా బాధ్యుల పై చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అన్నారు. Also Read: HOROSCOPE TODAY: నేడు ఈ రాశివారికి ధనలాభం..ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే Also Read: Saniya Mirza: తల్లిదండ్రులు ఎప్పటికీ ఆ విషయాన్ని మర్చిపోవద్దు..సానియా మీర్జా ఆసక్తికర వ్యాఖ్యలు!