Ap: ఏపీలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది.ఎప్పుడో వేసవి కాలం అంటే ఏప్రిల్ , మే నెలలో కనిపించే తాటి ముంజలు, మామిడి పండ్లు.. మూడు నెలలు ముందుగానే దర్శనమిచ్చాయి. విచిత్రంగా డిసెంబర్‌లోనే తాటి ముంజలు, మామిడి పండ్లు అందుబాటులోకి రావడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. విజయవాడలో తాటి ముంజలు, మామిడి పండ్లను రోడ్లు పక్కన ఉంచి విక్రయిస్తున్నారు. . ఇదంతా చూసి కొందరు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు వీటిని కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్తున్నారు. Also Read: AP Weather: దిశ మార్చుకున్న అల్పపీడనం..ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు వాస్తవానికి ఏటా వేసవికాలంలో, ఏప్రిల్ నెలలో తాటిముంజలు సీజన్ ఉంటుంది. జనాలు ఎండ తీవ్రతను నుంచి ఉపశమనం పొందేందుకు కొంటుంటారు. కానీ ఇప్పుడు రోడ్ల పక్కన డిసెంబర్‌లోనే తాటి ముంజలు కనిపిస్తున్నాయి. విజయవాడలోని బందరు రోడ్డులో గంగూరు సమీపంలో తాటిముంజలను డజను రూ.100 నుంచి రూ.120కి విక్రయిస్తున్నారు. జనాలు కూడా తాటి ముంజల్ని కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది మాత్రం డిసెంబర్‌లో తాటి ముంజలు ఏంటని చర్చించుకుంటున్నారు. Also Read: కామారెడ్డిలో విషాదం..ఒకేసారి మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మృతి..ఎస్సై అదృశ్యం! మరోవైపు విజయవాడలోనే మామడి పండ్లు కూడా రోడ్ల పక్కన కనిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా ఉలవపాడు ప్రాంతంలో తోటల్లోని రెండు వేల చెట్లలో మామిడి పంట దిగుబడికి వచ్చిందట. మొత్తం నాలుగు టన్నుల మామిడి పండ్లను విజయవాడ కృష్ణలంక సమీపంలో రోడ్డుపై వీటిని అమ్ముతున్నారు. వీటిని కిలో రూ.250 నుంచి రూ.300కు విక్రయిస్తున్నారు. జనాలు కూడా మామిడి పండ్లను కొనుగోలు చేస్తున్నారు. Also Read: Kazakhstan: కజకిస్తాన్ విమాన ప్రమాదంలో 38కి చేరిన మృతుల సంఖ్య అయితే డిసెంబర్ నెలలోనే తాటి ముంజలు, మామిడి పండ్లు ఎలా వచ్చాయని ఆరా తీస్తే.. అవి పైరు కాపు ఉత్పత్తులని.. వందల చెట్లలో కొన్ని ఇలా ముందే కాపునకు వస్తాయని రైతులు చెబుతున్నారు. Also Read: Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై క్యూ లైన్‌కు స్వస్తి! అందుకే ముందే ఇలా పంట దిగుబడి వచ్చిందంటున్నారు.వాస్తవానికి మామడి పండ్లు, తాటి ముంజలు ఏప్రిల్ నెలలో అమ్మకాలు చేస్తారు. వేసవి కాలంలో ఎక్కువగా పంట దిగుబడి ఉంటుంది. మామిడి పండ్లు ఆగస్టు నెల వరకు దొరకుతాయి.. ఆ తర్వాత పునాస మామిడిపండ్లు ఉండేవి. కానీ విచిత్రంగా తాటి ముంజలు మాత్రం డిసెంబర్‌లో రావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.