Kodali Nani: వైసీపీ కీలక నేత,మాజీ మంత్రి కొడాలి నానికి ఏపీ పోలీసుల నుంచి పెద్ద షాక్ తగిలింది.నాని ప్రధాన అనుచరుడు కాళి ని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. గుడివాడలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు బట్టల షాపు పై పెట్రోల్ దాడి కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.కాళిని అస్సాంలో గుడివాడ పోలీసులు పట్టుకున్నారు.
ఈ కేసులో ఇప్పటికే నెల్లూరు జైల్లో 13 మంది నిందితులు రిమాండ్ లో ఉన్నారు. అనుచరులు అరెస్ట్ అవుతున్నప్పటికీ కొడాలి నాని మాత్రం బయటకు రావడం లేదు. మరో 4 ఏళ్లు ఇదే పరిస్థితి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు.
తెలుగు దేశం పార్టీ నేతలు గుడివాడలో 2022 డిసెంబరు 26న పలుచోట్ల వంగవీటి రంగా వర్ధంతి చేయడానికి సిద్దమయ్యారు. డిసెంబరు 25న మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుకు కాళీ ఫోన్ చేసి రంగా వర్ధంతి నిర్వహిస్తే ఊరుకోమని బెదిరించాడు. తాము ఆ కార్యక్రమాన్ని నిర్వహించి తీరతామని చెప్పడంతో.. కాళీ చంపేస్తానని బెదిరించినట్లు ఆరోపణలున్నాయి.
ఆ తర్వాత రావి వెంకటేశ్వరరావు బట్టల దుకాణంపై 2022 డిసెంబర్ 25న కొడాలి నాని అనుచరులు పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేసినట్లు కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో అక్కడ టీడీపీ కార్యాలయానికి నిప్పంటించబోతుండగా వెంటనే పోలీసులు అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై గత ప్రభుత్వ హయాంలో చర్యలు తీసుకోకపోవడంతో.. ఇటీవల మళ్లీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
నాని అనుచరుల్ని ఇటీవల అరెస్ట్ చేయగా.. ప్రధాన అనుచరుడు కాళీ మాత్రం తప్పించుకున్నాడు. తాజాగా అసోంలో పోలీసులు అరెస్ట్ చేశారు