JNTUK: 'వాక్ విత్ నేషన్స్'..194 దేశాల జాతీయ పతాకాల ఆవిష్కరణ!

సుందర్‌ అసోసియేట్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ బాదం సుందరరావు ఆధ్వర్యంలో జేఎన్‌టీయూకే ప్రాంగణంలో 'వాక్ విత్ నేషన్స్' పేరుతో అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన 194 ప్రపంచదేశాల జాతీయ పతాకాలను ఏర్పాటుచేశారు. ఇది వసుదైక కుటుంబమన్నారు.

New Update
Walk with Nations

Walk with Nations Photograph: (Walk with Nations)

Walk with Nations: పూర్వ విద్యార్థి సుందర్‌ అసోసియేట్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ బాదం సుందరరావు సహకారంతో జేఎన్‌టీయూకే ప్రాంగణంలో 'వాక్ విత్ నేషన్స్' పేరుతో అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంవద్ద భిన్నత్వంలో ఏకత్వం అనే నానుడిని స్ఫూర్తిగా తీసుకుని ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన 194 ప్రపంచదేశాల జాతీయ పతాకాలను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ప్రపంచదేశాల జాతీయ జెండాలను ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని వీసీ మురళీకృష్ణ అన్నారు.

వసుదైక కుటుంబ ముఖ్య ఉద్ధేశ్యం..

ప్రపంచంలో జెనీవా, అమెరికాలోని న్యూయా ర్క్‌, దక్షిణకొరియాలోని సియోల్‌, చైనాలోని షాం గై, డొమినికన్‌ రిపబ్లిక్‌లోని శాంటో డొమింగోలో ప్రపంచ దేశాల జాతీయ జెండాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఆరోది కాకినాడ జేఎన్టీయూకేలో ఏర్పాటు చేశామని వీసీ చెప్పారు. వసుదైక కుటుంబం అనేది దీని ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. అన్ని దేశాల జాతీయ పతాకాలు ఒకే చోట ఉండడం ద్వారా కలిగే అనుభూతి చెప్పలేనిదని కొనియాడారు. భూమిలోని సకల జీవరాశులు ఒక కుటుంబంగా భావిస్తారని, అందుకే ఇక్కడ ప్రపంచ దేశాల జాతీయ పతాకాలను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Kamareddy: ట్రయాంగిల్ సూసైడ్‌లో బిగ్ ట్విస్ట్.. వివాహేతర సంబంధమే!

194 ప్రపంచ దేశాల జాతీయ పతాకాలు..

ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన 194 ప్రపంచ దేశాల జాతీయ పతాకాలు అక్షర క్రమంలో ఉంటాయని, ప్రతి జెండా స్తంభానికి క్యూ ఆర్‌ కోడ్‌తో కూడిన డిస్‌ప్లేను ఉంచారు. దీని ద్వారా ఆ దేశ జనాభా, రాజధాని, కరెన్సీ తదితర పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. వర్సిటీ అనుబంధ కళాశాలలతోపాటు జిల్లాలోని ప్రతిపాఠశాల, సంస్థ జేఎన్టీయూకేను సందర్శించి ఫొటోలు తీసుకోవడాన్ని గర్వంగా భావించడంతో పాటు విజ్ఞాన, పర్యాటక ప్రదేశంగా మారబోతుందన్నారు. వాక్‌ విత్‌ నేషన్స్‌ అనే ప్రపంచ పౌరసత్వం స్ఫూర్తిని ప్రతిబింబించే ప్రాజెక్ట్‌ అని, ఈ ఐకానిక్‌ ప్రదర్శన మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు