AP: రైల్వే గుడ్‌ న్యూస్‌..ఇక నుంచి ఈ స్టేషన్లలో కూడా ఆ రైళ్లు ఆగుతాయి!

ఏపీలో మరో ఎక్స్‌ప్రెస్ రైలు ఆగనుంది.. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు అందాయి. నేటి నుంచి ఎక్స్‌ప్రెస్ రైలు స్టేషన్‌లో ఆగనున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో.

New Update
Railway : రైల్వే శాఖ కీలక నిర్ణయం... ఇక నుంచి అలా చేస్తే జరిమానా తప్పదు!

Ap : ఏపీలో మరో రైల్వే స్టేషన్‌లో మరో ఎక్స్‌ప్రెస్ కొత్తగా ఆగబోతుంది. ఈ మేరకు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ముంబై- కన్యాకుమారి- ముంబై వెళ్లే జయంతి ఎక్స్‌ప్రెస్‌ రైలు రాజంపేట స్టేషన్‌లో నేటి నుంచి ఆగనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు రైల్వేశాఖ నుంచి ఆదేశాలు కూడా వచ్చాయి. కొవిడ్‌ సమయం నుంచి జయంతి ఎక్స్‌ప్రెస్ రైలుకు స్టాపింగ్‌ ఎత్తివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Also Read: Techie Suicide: ఆత్మహత్యకు ముందు స్నానం..వందసార్లు శివనామస్మరణ

గతంలోనే పలు సందర్భాల్లో అధికారులకు విన్నవించిన్నప్పటికీ సరిగా పట్టించుకోలేదు. ఇటీవల బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిలోకేశ్‌ రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి వినతి పత్రం అందించిన విషయం తెలిసిందే. అలాగే సికింద్రాబాద్‌ రైలు నిలయం ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆపరేషన్‌ మేనేజర్‌ పద్మజను కలిసి సమస్యను తెలియజేశారు. వెంటనే స్పందించి రైలును ఆపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Also Read: TTD: తిరుమల సుప్రభాత సేవలో మార్పులు..ఎప్పటి నుంచి అంటే!

గత నెలలో కూడా రైల్వే అధికారులు ఏపీలో రెండు ప్రత్యేక రైళ్లు ఆపేందుకు పచ్చ జెండా ఊపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో రెండు ప్రత్యేక రైళ్లు ఆగుతున్నాయి. 02121, 02122 జబల్పూర్‌-మధురై ఎక్స్‌ప్రెస్‌, 04717, 04718 తిరుపతి- జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఒంగోలులో ఆపేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌‌ ను కోరగా.. రైల్వే అధికారులు వెంటనే ఉత్తర్వులు ఇచ్చారు.

Also Read: Vangalapudi Anitha: ఏపీ హోంమంత్రి అనితకు హైకోర్టులో బిగ్ రిలీఫ్

మరోవైపు అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం విజయవాడ మీదుగా శబరిమలకు ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. ఈ మేరకు రైల్వే అధికారులు ఒక ప్రకటన చేశారు. ఈ నెల 11, 18, 25 తేదీల్లో కాకినాడ- కొల్లాం ప్రత్యేక రైలు కాకినాడ పోర్టులో రాత్రి 11.50కి బయలుదేరి.. రెండో రోజు ఉదయం 5.30కి కొల్లానికి చేరుతుంది. ఈ నెల 13, 20, 27 తేదీల్లో ఈ రైలు తిరుగు ప్రయాణంలో కొల్లాంలో ఉదయం 8.40కి బయలుదేరి.. రెండో రోజు సాయంత్రం 4 గంటలకు కాకినాడ పోర్టు కి వస్తుంది. 

Also Read: Ap Rains: ఏపీ పై అల్పపీడనం ఎఫెక్ట్‌..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

ఈ ప్రత్యేక రైలు కాకినాడ టౌన్, సామర్లకోట, రాజమహేంద్రవరం, నిడదవోలు, తణుకు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, త్రిశూర్, ఎర్నాకుళం, కొట్టాయం స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు వివరించారు.

దక్షిణ మధ్య రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లను దారి మళ్లించారు. భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో అన్నారు. ఈ రైళ్లు నిడదవోలు- ఏలూరు- విజయవాడ స్టేషన్‌ మీదుగా కాకుండా, నిడదవోలు- భీమవరంటౌన్‌- గుడివాడ- విజయవాడ మీదుగా నడవనున్నాయి. 

హౌరాడా- ఎస్‌ఎంవీటీ బెంగళూర్‌ ఈనెల 11, 13, 14, 16, 17, 20, 21, 23, 24 తేదీల్లో .. ధన్‌బాద్‌- అలేప్పీ బొకారో ఎక్స్‌ప్రెస్‌ 16, 17, 20, 21, 23, 24 తేదీల్లో.. హతియా- ఎర్నాకుళం 16, 23 తేదీల్లో.. హతియా- ఎస్‌ఎంవీటీ బెంగళూర్‌  10, 17, 24 తేదీల్లో.. టాటానగర్‌- ఎస్‌ఎంవీటీ బెంగళూర్‌ 20న.. హతియా- ఎస్‌ఎంవీటీ బెంగళూర్‌  21న.. ముంబై సీఎస్‌టీ- భువనేశ్వర్‌  రైలు 11, 13, 14, 25, 27, 28, 30 తేదీల్లో.. గుంటూరు- విశాఖ (17239) 26, 28, 29, 31 తేదీల్లో దారి మళ్లించనున్నట్లు వివరించారు. ఈనెల 10న బయలుదేరిన ఎస్‌ఎంవీటీ బెంగళూర్‌- అగర్తలా హమ్‌సఫర్‌ రైలు దాదాపు 7.45 గంటలు ఆలస్యంగా నడుస్తుంది.

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు