Big Breaking: ఏపీలో భారీ అగ్ని ప్రమాదం

శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురం సమీపంలోని ఉన్న ఓ జీడి పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 2.50 కోట్ల వీలువైన జీడిపప్పు దగ్ధమైంది. షార్ట్‌ సర్క్యట్‌ కారణంగానే ఇలా జరుగుంటుందని పైర్‌ సిబ్బంది వెల్లడించారు.

New Update
Parawada Pharma City

Fire Accident

Fire Accident: శ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మందస మండలం హరిపురం సమీపంలోని  ఉన్న ఓ జీడి పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికలు.. తెలిపిన వివరాల ప్రకారం..హరిపురం సమీపంలో శనివారం అర్ధరాత్రి సమయంలో జీడి పరిశ్రమలో మంటలు చెలరేగాయి. వెంటనే  అగ్రిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది ఘటనాస్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. షార్ట్‌ సర్క్యట్‌ కారణంగానే ఇలా జరుగుంటుందని పైర్‌ సిబ్బంది వెల్లడించారు..

రూ.2.50 కోట్ల ఆస్తి నష్టం:

ఈ ప్రమాదంలో సుమారు రూ. 2.50 కోట్ల వీలువైన జీడిపప్పు దగ్థమైంది. రెండున్నర కోట్లు ఆస్తి నష్టం జరగటంతో యజమని  కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. జీడిపప్పు గోదాంలో వంటలు చెడరేగడంతో ఆ ప్రాంత ప్రజలంతా ఒక్కసారిగా భయ భ్రాంతులకు గురయ్యారు. కోట్ల విలువ చేసే జీడిపప్పు దగ్ధం అవ్వడంపై యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఇది కూడా చదవండి: కాఫీ ఎక్కువగా తాగితే బీపీ తప్పదా?

భారీ అగ్ని ప్రమాదం వలన ఆ ప్రాంతం అంత ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగతో అలముకున్నది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కోట్లు విలువైన జీడిపప్పు అగ్నికి దగ్ధమవడంతో ప్రభుత్వం ఆదుకోవాలని యాజమన్యం విజ్ఞప్తి చేస్తోంది. ఈ ప్రమాదంలొ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: క్యాప్సికం సాగుతో లక్షల్లో ఆదాయం

 

ఇది కూడా చదవండి: చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించే శక్తివంతమైన కూరగాయలు

 

ఇది కూడా చదవండి: చలికాలంలో చర్మం మెరిసిపోవాలంటే ఈ నూనెలు వాడండి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు